Nicholas Pooran: ఒకే ఏడాది 150 సిక్సులు.. టీ20ల్లో విండీస్ బ్యాటర్ సరికొత్త చరిత్ర

Nicholas Pooran: ఒకే ఏడాది 150 సిక్సులు.. టీ20ల్లో విండీస్ బ్యాటర్ సరికొత్త చరిత్ర

వెస్టిండీస్ బ్యాటర్ నికోలస్ పూరన్ విధ్వంసం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుత టీ20 క్రికెట్ లో టాప్ ఆటగాళ్ల లిస్టులో పూరన్ ఖచ్చితంగా ఉంటాడు. లీగ్ ఏదైనా సిక్సులు అలవోకగా కొట్టేస్తాడనే పేరుంది. ముఖ్యంగా 2024 లో పూరన్ ఏకంగా అన్ని రకాల టీ20 క్రికెట్ లో 150 కి పైగా సిక్సర్లు బాదేశాడు. దీంతో టీ20 క్రికెట్ చరిత్రలో ఒక క్యాలెండర్ ఇయర్‌లో 150కి పైగా సిక్సర్లు బాదిన తొలి బ్యాట్స్‌మెన్‌గా వెస్టిండీస్ బ్యాటర్ నికోలస్ పూరన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు.  

ఐపీఎల్, టీ20 వరల్డ్ కప్  లో విధ్వంసం సృష్టించిన పూరన్.. ప్రస్తుతం కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో సిక్సర్ల వర్షం కురిపిస్తున్నాడు. సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 43 బంతుల్లో 93 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్ లో ఏకంగా 7 సిక్సర్లున్నాయి. దీంతో 150 సిక్సర్ల మార్క్ అందుకున్నాడు. 2015 వెస్టిండీస్ విధ్వంసకర వీరుడు క్రిస్ గేల్ టీ20 క్రికెట్ లో అత్యధికంగా 135 సిక్సర్లతో అగ్ర స్థానంలో ఉన్న రికార్డ్ ను పూరన్ బద్దలు కొట్టడమే కాక.. 150 సిక్సర్ల క్లబ్ లోకి చేరాడు. మరో మూడు నెలలు ఉండడంతో పూరన్ సిక్సర్ల సంఖ్య 200 కు చేరుకునే అవకాశం ఉంది. 

Also Read:-డబ్ల్యూటీసీలో ఇండియా టాప్‌‌‌‌ మరింత పదిలం

ఈ క్రమంలో పూరన్ 2024 లో టీ20 క్రికెట్ లో 2000 పరుగుల పరుగులు పూర్తి చేసుకున్నాడు. సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 93 పరుగుల ఇన్నింగ్స్ తో ఈ ఫీట్ అందుకున్నాడు. పాకిస్థాన్ ఆటగాడు మహ్మద్ రిజ్వాన్ ఒక క్యాలెండర్ ఇయర్‌లో 2000 పరుగుల మార్కును దాటిన మొదటి ఆటగాడు మరియు.  2021లో అతను ఈ ఘనత అందుకున్నాడు.