LSG vs CSK: DRSతో మహేంద్రుడు మ్యాజిక్.. పూరన్‌కు చెక్ పెట్టిన ధోనీ

LSG vs CSK: DRSతో మహేంద్రుడు మ్యాజిక్.. పూరన్‌కు చెక్ పెట్టిన ధోనీ

ఎకనా క్రికెట్ స్టేడియంలో లక్నో సూపర్ జయింట్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ DRS తీసుకోవడంలో తనకు తానే సాటి అని మరోసారి నిరూపించుకున్నాడు. ధోనీ తన సమయస్ఫూర్తితో సోమవారం (ఏప్రిల్ 14)  లక్నో  స్టార్ బ్యాటర్ నికోలస్ పూరన్ (8)ను ఔట్ చేయడంలో సఫలమయ్యారు. ఇన్నింగ్ నాలుగో ఓవర్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది. అన్షుల్ కాంబోజ్ వేసిన ఔట్ స్వింగ్ డెలివరీ ఆడడంలో పూరన్ విఫలమయ్యాడు. 

Also Read :- హాఫ్ సెంచరీతో పంత్ ఒంటరి పోరాటం.. చెన్నై టార్గెట్ ఎంతంటే..?

బంతి బ్యాట్ ను మిస్ అవుతూ ప్యాడ్ లకు తగిలింది. దీంతో యువ పేసర్ కాంబోజ్ ఎల్బీడబ్ల్యూ కోసం అప్పీల్ చేయడంతో అంపైర్ నాటౌట్ గా ప్రకటించాడు. అయితే ధోనీ మాత్రం ఔట్ అని నమ్మి వెంటనే రివ్యూ కోరాడు. థర్డ్ అంపైర్ రీప్లేలో చూడగా.. బంతి లెగ్ స్టంప్ ను తగిలినట్టు చూపించింది. "వికెట్స్ హిట్టింగ్" అని చూపించడంతో అంపైర్ తన నిర్ణయాన్ని మార్చుకొని ఔట్ ఇవ్వాల్సి వచ్చింది. ఈ వికెట్ చెన్నైకు ఎంతో కీలకంగా మారింది. పూరన్ ఔటైన తర్వాత జట్టు స్కోర్ వేగం తగ్గిపోయింది. అంతేకాదు ఈ టోర్నీలో సూపర్ ఫామ్ లో ఉన్న పూరన్ ఔట్ చేసి లక్నోని కష్టాల్లో పడేశాడు. 

ఈ మ్యాచ్ విషయానికి వస్తే టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగుల ఒక మాదిరి స్కోర్ కే పరిమితమైంది. 63 పరుగులు చేసి పంత్ టాప్ స్కోరర్ గా  నిలిచాడు. చెన్నై బౌలర్లలో పతిరానా, జడేజా తలో రెండు వికెట్లు పడగొట్టారు. ఖలీల్ అహ్మద్, కంబోజ్ లకు చెరో వికెట్ దక్కింది.