కోల్‌బెల్ట్, వెలుగు: సింగరేణిలో మారు పేర్లను సవరించి, విజిలెన్స్పెండింగ్కేసులను పరిష్కరించి వారసత్వ జాబ్ లు ఇవ్వాలని కార్మికుల డిపెండెంట్లు డిమాండ్ చేశారు. ఇంటిపేర్లు.. మారు పేర్లతో పనిచేసి రిటైర్డ్అయిన కార్మికుల వారసులు తమకు జాబ్‌లు కల్పించాలని డిమాండ్‌చేస్తూ సోమవారం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లోని బెల్లంపల్లి, మందమర్రి ఏరియాల్లో పోరు యాత్ర ప్రారంభించారు.
బెల్లంపల్లి ఏరియా గోలేటిలో వివిధ కార్మిక సంఘాల మద్దతు పలకగా యాత్రను కొనసాగించారు. బెల్లంపల్లి, మందమర్రి ఏరియా సింగరేణి జీఎం ఆఫీసుల ఎదుట ధర్నాలు చేపట్టారు. ఈ యాత్ర సింగరేణివ్యాప్తంగా కొనసాగనుంది. ఈ సందర్భంగా కార్మికుల వారసులు మాట్లాడుతూ.. సింగరేణిలో 30ఏండ్లు పని చేసి రిటైర్డ్ అయిన కార్మికుల మారు పేర్లను సవరించకుండా నిర్లక్ష్యం చేస్తూ తమకు జాబ్ లు ఇవ్వడం లేదని మండిపడ్డారు.
విజిలెన్స్ఎంక్వైరీ పేరిట ఏండ్లుగా పెండింగ్‌లో పెట్టడడమేంటని ప్రశ్నించారు. దరఖాస్తు చేసుకుంటే రెండు పేర్లు ఉన్నాయనే కారణాలు చూపుతూ విజిలెన్స్ ఆఫీసర్లు జాబ్ రాకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జాబ్ లు రాకపోగా కుటుంబ పోషణ భారమై మనస్తాపంతో పలువురు వారసులు చనిపోయారని గుర్తుచేశారు. సింగరేణికి, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోయిందన్నారు.
కాంగ్రెస్ సర్కార్ చొరవ చూపి వన్ టైమ్సెటిల్ మెంట్ కింద జాబ్ కల్పించాలని కోరారు. మందమర్రి ఏరియా సింగరేణి జీఎం జి.దేవేందర్, బెల్లంపల్లి ఏరియా ఆఫీసర్ఉమాకాంత్కు వినతిపత్రాలు అందజేశారు. కార్మిక వారసుల పోరుయాత్రకు సీఐటీయూ, ఇఫ్టూ లీడర్లు ఎస్.వెంకటస్వామి, అల్లి రాజేందర్, టి.శ్రీనివాస్, బ్రహ్మనందం, జఫర్, చాంద్‌పాషా తదితరులు మద్దతు పలికారు.