Govt Jobs: NICLలో 500 ఉద్యోగాలు.. డిగ్రీ అర్హత, ఆకర్షణీయమైన జీతం

Govt Jobs: NICLలో 500 ఉద్యోగాలు.. డిగ్రీ అర్హత, ఆకర్షణీయమైన జీతం

ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (NICL) 500 అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ప్రభుత్వ ఉద్యోగంతో జీవితంలో స్థిరపడాలనుకునేవారికి ఇదొక సువర్ణవకాశం. ఔత్సహికులు తక్కువ పోస్టులున్నాయని నిరుత్సాహ పడకండి.. ఓ మంచి ప్రణాళికలతో ప్రిపేర్ అయితే సులభంగా జాబ్ కొట్టొచ్చు.

మొత్తం ఖాళీలు: 500

అత్యధికంగా పశ్చిమ బెంగాల్‌లో 58 ఖాళీలుండగా.. మహారాష్ట్ర 52, కర్ణాటక 40, రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాలలో 35 చొప్పున.. రెండు తెలుగు రాష్ట్రాలలో 33(ఆంధ్ర ప్రదేశ్ 21+ తెలంగాణ 12) పోస్టులు ఉన్నాయి.

అర్హతలు: అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదేని విభాగంలో డిగ్రీ లేదా దానికి సమానమైన అర్హతను కలిగి ఉండాలి. అలాగే స్థానిక భాషపై పట్టు ఉండాలి.

వయోపరిమితి: 01/10/2024 నాటికి అభ్యర్థుల వయస్సు కనీష్టంగా 21, గరిష్టంగా 30 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం రిజర్వేషన్ గల అభ్యర్థులకు వయసులో సడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు ఫీజు: SC/ ST/ PwBD/EXS అభ్యర్థులు రూ.100/ దరఖాస్తు రుసుము చెల్లించాలి. ఇతర అభ్యర్థులు రూ.850 చెల్లించాలి.

ఎంపిక ప్రక్రియ: దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరూ ఆన్‌లైన్ ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షకు హాజరవ్వాలి. మెయిన్ పరీక్షలో అర్హత సాధించిన మార్కులు, ప్రాంతీయ భాషపై పట్టు ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. మెయిన్ ఎగ్జామినేషన్‌లో షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులకు కంపెనీ ప్రాంతీయ భాష పట్టుపై పరీక్ష నిర్వహిస్తుంది. ఇందులో కూడా అర్హత సాధించాలి

ప్రొబేషన్ పిరియడ్: ఎంపికైన అభ్యర్థులు కనీసం 6 నెలల పాటు ప్రొబేషన్‌ పిరియడ్ లో ఉంటారు. ఈ కాలంలో కంపెనీ అంచనాలను అందుకోవడంలో విఫలమైన వారి ప్రొబేషన్ కాలం పొడిగించవచ్చు.

జీతభత్యాలు: రూ.22,405 నుంచి రూ.62,265 వరకు ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

తెలుగు రాష్ట్రాలలో పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్/ రంగారెడ్డి, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం, ఒంగోలు.

ముఖ్యమైన తేదీలు:

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ: అక్టోబర్‌ 24, 2024
  • దరఖాస్తులకు చివరితేది: నవంబర్‌ 11, 2024

నోటిఫికేషన్ కోసం NICL Assistant Recruitment 2024 ఇక్కడ క్లిక్ చేయండి.