నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ దేశవ్యాప్తంగా ఎన్‌ఐసీఎల్ కార్యాలయాల్లో ఓపెన్ మార్కెట్ ప్రాతిపదికన క్లాస్–-III కేడర్‌లో 500 అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్ కోరుతోంది.
అర్హత: ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత. అభ్యర్థి దరఖాస్తు చేసే రాష్ట్రానికి సంబంధించి ప్రాంతీయ భాష చదవడం, రాయడం, మాట్లాడటం అవసరం. వయసు 1 అక్టోబర్ 2024 నాటికి 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
సెలెక్షన్: ఆన్‌లైన్ ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామినేషన్, రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
ప్రిలిమ్స్: మొత్తం 100 మార్కుల్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఆబ్జెక్టివ్ (30 ప్రశ్నలు- 30 మార్కులు), రీజనింగ్ ఎబిలిటీ ఆబ్జెక్టివ్ (35 ప్రశ్నలు- 35 మార్కులు), క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఆబ్జెక్టివ్ (35 ప్రశ్నలు- 35 మార్కులు).
మెయిన్స్: 200 మార్కులకు మెయిన్స్ ఉంటుంది. ఇందులో టెస్ట్ ఆఫ్ రీజనింగ్ (40 ప్రశ్నలు- 40 మార్కులు), టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ (40 ప్రశ్నలు- 40 మార్కులు), టెస్ట్ ఆఫ్ న్యూమరికల్ ఎబిలిటీ (40 ప్రశ్నలు- 40 మార్కులు), టెస్ట్ ఆఫ్ జనరల్ అవేర్‌నెస్ (40 ప్రశ్నలు- 40 మార్కులు), టెస్ట్ ఆఫ్ కంప్యూటర్ నాలెడ్జ్ (40 ప్రశ్నలు- 40 మార్కులు)
అప్లికేషన్స్: అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో అక్టోబర్ 24 నుంచి నవంబర్ 11 వరకు దరఖాస్తు చేసుకోవాలి.ఫేజ్-I ఆన్‌లైన్ పరీక్ష నవంబర్ 30న, ఫేజ్-II ఆన్‌లైన్ పరీక్ష డిసెంబర్ 28న నిర్వహిస్తారు. వివరాలకు www.nationalinsurance.nic.co.in వెబ్సైట్లో సంప్రదించాలి.