కారకస్: వెనిజులా అధ్యక్షుడిగా నికోలస్ మదురో మూడోసారి ఎన్నికయ్యారు. ఆదివారం జరిగిన ఎన్నికల్లో ఆయన 51% ఓట్లు సాధించారని ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఆయన ప్రత్యర్థి ఎడ్మండో గొంజాలెంజ్ కు 44% ఓట్లు వచ్చాయని తెలిపారు.
61 ఏండ్ల మదురో ప్రెసిడెంట్ గా గెలవడం ఇది మూడోసారి. అయితే, సర్వేల్లో తీవ్ర వ్యతిరేకత కనిపించినా.. ఆయన గెలవడం ఆసక్తికరంగా మారింది. ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరిగినందుకే ఆయన గెలిచారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.