
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నిధి అగర్వాల్ కి సినిమా ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే ఈ అమ్మడు తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తదితర స్టార్ హీరోల సినిమాలలో హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఇటీవలే నిధి అగార్వల్ కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా నటిస్తున్న సినిమాలో హీరోయిన్ గా నటించే ఆఫర్ కొట్టేసినట్లు సమాచారం.
ALSO READ | హాట్ బ్యూటీతో అదిరిపోయే సర్ప్రైజ్ ఇస్తున్న రాబిన్హుడ్ టీమ్..
ప్రస్తుతం హీరో సూర్య లక్కీ భాస్కర్ సినిమాతో మంచి డీసెంట్ హిట్ అందుకున్న తెలుగు ప్రముఖ డైరెక్టర్ వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాని ప్రముఖ సినీ నిర్మాత నాగవంశీ సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ నేరేషన్ కూడా కంప్లీట్ అయింది. దీంతో ఈ సినిమా జూన్ నెలలో పట్టాలెక్కనున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాలో నిధి అగర్వాల్ తో పాటూ మరో ఔంగ్ హీరోయిన్ కూడా సెలెక్ట్ చేసినట్లు సమాచారం. అయితే సూర్య సినిమాలో నిధి అగర్వాల్ ని తీసుకున్న విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం బాగానే వైరల్ అవుతున్నాయి.
ఈ విషయం ఇలా ఉండగా నిధి అగార్వల్ తెలుగులో హరిహర వీరమల్లు, ది రాజాసాబ్ చిత్రాల్లో నటిస్తోంది. ఈ సినిమాలు ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉంది కానీ షూటింగ్ కంప్లీట్ కాకపోవడంతో రిలీజ్ వాయిదా పడుతూ వస్తున్నాయి.