Nidhhi Agerwal: అందుకే మూడేళ్లు సినిమాలకి గ్యాప్ వచ్చిందంటున్న రాజాసాబ్ బ్యూటీ..

తనదైన గ్లామర్‌‌‌‌తో యూత్‌‌‌‌ ఆడియెన్స్‌‌‌‌ను అట్రాక్ట్  చేసిన నిధి అగర్వాల్..  మూడేళ్లుగా ప్రేక్షకులకు దూరమైంది. ప్రస్తుతం మాత్రం వరుస క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తోంది. పవన్ కళ్యాణ్‌‌‌‌తో ‘హరిహర వీరమల్లు’, ప్రభాస్‌‌‌‌తో ‘రాజా సాబ్​’ లాంటి భారీ సినిమాలు చేస్తోంది. అయితే తనకు వచ్చిన ఈ గ్యాప్‌‌‌‌ గురించి రీసెంట్‌‌‌‌ ఇంటర్వ్యూలో మాట్లాడిన నిధి ‘నేను గ్యాప్ ఇవ్వలేదు. గ్యాప్ వచ్చింది.

 ఫస్ట్ లాక్ డౌన్‌‌‌‌కు ముందే  ‘హరిహర వీరమల్లు’కు సైన్ చేశా.  ఆ టైమ్‌‌‌‌కి గ్యాప్ లేదు. కానీ ఈ సినిమా షూటింగ్‌‌‌‌ ఆలస్యమవడంతో చాలా గ్యాప్ వచ్చింది. ఈ సినిమా కంప్లీట్ చేసే వరకు వేరే ప్రాజెక్ట్ ఒప్పుకోకూడదని నేను కాంట్రాక్ట్ మీద సైన్ చేశా. అందుకే ఆఫర్స్ వచ్చినా వేరే సినిమాలకు కమిట్ అవ్వలేదు.  ‘రాజా సాబ్’లో చాన్స్ వచ్చినప్పుడు మాత్రం ఇలాంటి సినిమా వదులుకోకూడదని, ‘హరి హర వీరమల్లు’ టీమ్‌‌‌‌తో మాట్లాడి ఓకే చేసుకున్నా. ఈ రెండూ చిత్రాలు నాకు వచ్చిన గ్యాప్‌‌‌‌ను కవర్ చేస్తాయి. 

అలాగే నా కెరీర్‌‌‌‌‌‌‌‌కు ఎంతో హెల్ప్ అవుతాయనే నమ్మకం ఉంది’. అని చెప్పింది. పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్‌‌‌‌‌‌‌‌గా ‘హరిహర వీరమల్లు’ రూపొందుతుండగా, రొమాంటిక్ కామెడీ హారర్ మూవీగా ‘రాజా సాబ్’ తెరకెక్కుతోంది. ఈ రెండు చిత్రాలు ఈ ఏడాదే విడుదలకు సిద్ధమవుతున్నాయి.