నిధి అగర్వాల్ కు వేధింపులు

  • సైబర్ క్రైమ్​ పోలీసులకు ఫిర్యాదు చేసిన హీరోయిన్

బషీర్ బాగ్, వెలుగు: సోషల్​ మీడియాలో ఓ వ్యక్తి తనని టార్గెట్​చేసి నిత్యం వేధిస్తున్నాడని సినీ హీరోయిన్ ​నిధి అగర్వాల్ హైదరాబాద్​సైబర్ ​క్రైమ్ ​పోలీసులను ఆశ్రయించింది. సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఆన్​లైన్​లో ఫిర్యాదు చేసింది. తనతోపాటు తన స్నేహితులను, బంధువులను టార్గెట్​చేసి సోషల్ ​యాప్స్​లో బెదిరింపులకు దిగుతున్నాడని పేర్కొంది.

అజ్ఞాత వ్యక్తి వేధింపులతో తాను మానసికంగా ఇబ్బందులు పడుతున్నానని వాపోయింది. ఆమె ఫిర్యాదపై సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిధి అగర్వాల్ ప్రస్తుతం ప్రభాస్ తో రాజాసాబ్, పవన్ కల్యాణ్​తో హరిహర వీరమల్లు సినిమాల్లో హీరోయిన్​గా 
నటిస్తోంది.