![నిధి అగర్వాల్ కు వరుస ఆఫర్లు](https://static.v6velugu.com/uploads/2023/03/Nidhi-Aggarwal_1GxjblirMW.jpg)
ఐదేళ్ల క్రితం ‘సవ్యసాచి’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నిధి అగర్వాల్.. మూడో సినిమా ‘ఇస్మార్ట్ శంకర్’తో బ్లాక్ బస్టర్ అందుకుంది. ఆ తర్వాత కోలీవుడ్‌పై ఫోకస్ పెట్టిన ఆమె, తిరిగి తెలుగులో బిజీ అవుతోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌కు జంటగా ‘హరిహర వీరమల్లు’ చిత్రంలో నటిస్తోంది. పవన్ నటిస్తున్న ఫస్ట్ పీరియాడిక్ మూవీ కావడంతో అంచనాలు ఓ స్థాయిలో ఉన్నాయి. ఈ సినిమాతో టాలీవుడ్‌లో తనకు మరో హిట్ గ్యారెంటీ అనుకుంటున్న టైమ్‌లో.. మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో అవకాశం వచ్చింది. ప్రభాస్ హీరోగా మారుతి తెరకెక్కిస్తున్న ‘రాజా డీలక్స్’లో హీరోయిన్‌గా నటిస్తోంది.
మరో ఇద్దరు హీరోయిన్స్ ఉన్నప్పటికీ నిధినే మెయిన్ లీడ్ అని టాక్. త్వరలోనే ఈ సినిమాను అనౌన్స్ చేయనున్నారు. ఈ ఏడాది ఈ రెండు క్రేజీ ప్రాజెక్టులతో నిధి టాప్ లీగ్‌లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఇప్పటికే రెండు, మూడు కొత్త సినిమాలకు ఆమె సైన్ చేసిందనే టాక్ వినిపిస్తోంది. మొత్తానికి వరుస స్టార్ హీరోల సినిమాలకు కమిట్ అవుతూ స్మార్ట్ లైనప్‌తో ముందుకెళ్తోంది నిధి అగర్వాల్.