
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ప్రైవేట్ సెక్రటరీగా ఇండియన్ ఫారెన్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారి నిధి తివారీ నియమితులయ్యారు. కేంద్ర కెబినెట్ అపాయింట్ మెంట్స్ కౌన్సిల్ ఆమె నియామకాన్ని ఆమోదించిందని డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ విభాగం(డీవోపీటీ) ప్రకటించింది.
వారణాసికిచెందిన నిధి తివారీ సివిల్ సర్వీస్ పరీక్షలో 96వ ర్యాంక్ సాధించారు. ఆమె 2014 ఇండియన్ ఫారెన్ సర్వీస్ బ్యాచ్ అధికారి. సివిల్ సర్వీసులో చేరడానికి ముందు వారణాసిలో వాణిజ్య పన్నుల విభాగంలో అసిస్టెంట్ కమిషనర్ గా నిధి పనిచేశారు. 2023 జనవరి 6 నుంచి ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎమ్ వో)లో డిప్యూటీ సెక్రటరీగా పని చేస్తున్నారు.