దేశంలో నిఫా వైరస్ కలకలకం సృష్టిస్తోంది. కేరళలో మరో వ్యక్తి నిఫాతో చనిపోయాడు. మలప్పురం జిల్లాలో 23ఏండ్ల యువకుడు నిఫావైరస్ లక్షణాలతో బాధపడుతూ చనిపోయాడు. గతనెల ఇదే జిల్లాలో ఓ విద్యార్థి చనిపోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
also read : డాక్టర్ రేప్ అండ్ మర్డర్ కేసులో.. ఆర్జీ కర్ మాజీ ప్రిన్సిపాల్ అరెస్టు
నిఫా లక్షణాలు ఉంటే తక్షణమే టెస్టులు చేయించుకోవాలని ఆదేశించారు. చనిపోయిన వ్యక్తి రక్తనమూనాలను సేకరించిన వైద్యులు.. పుణె ల్యాబ్ కు టెస్టుకోసం పంపారు. చనిపోయిన వ్యక్తి కుటుంబాన్ని క్వారంటైన్ కి తరలించారు. కోవిడ్ తరహా నిబంధనలు వర్తిస్తాయని జిల్లా అధికారులు హెచ్చరించారు. సామాజిక దూరం పాటించాలని సూచించారు.