హర్యానా రిజల్ట్ ఎఫెక్ట్.. లాభాల్లో స్టాక్ మార్కెట్..హర్యానాలో ఊహించని ఫలితాలు వచ్చాయి బీజేపీకి..హర్యానా, జమ్మూలో బీజేపీలో ఓడిపోయిద్ది అని.. అన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి.. అందుకు భిన్నంగా హర్యానా ఫలితాలు వస్తున్నాయి.. హర్యానాలో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ కంటే అధికంగానే స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతుంది.
Also Read :- జమ్మూకాశ్మీర్, హర్యానా ఓట్ల కౌంటింగ్
ఈ క్రమంలోనే స్టాక్ మార్కెట్ లో జోష్ కనిపిస్తుంది. లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెన్స్ 300 పాయింట్లు.. నిఫ్టీ 100 పాయింట్ల లాభంలో ఉన్నాయి.. బ్యాంకింగ్, రిలయన్స్, అదానీ షేర్లలో ర్యాలీ కొనసాగుతుంది.అయితే ఆటోమొబైల్, ఇన్సూరెన్స్, హెల్త్ సెక్టార్ షేర్లు మాత్రం నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
మంగళవారం ( అక్టోబర్ 08)ఉదయం 11:25 గంటలకు సెన్సెక్స్ 494.63 (0.61%) పాయింట్ల లాభంతో 81,532.00 వద్ద ట్రేడ్ అవుతోంది. మరోవైపు నిఫ్టీ 170పాయింట్ల పెరిగి 24,964.00 వద్ద ట్రేడవుతోం ది. మందకోడిగా ప్రారంభమై సెన్సెక్స్ ఉదయం 9.51 గంటలకు 300పాయింట్లు పెరిగి 81,352కి చేరింది. మరోవైపు, నిఫ్టీ 100 పాయింట్ల లాభంతో 24,887.00 వద్ద ట్రేడయింది.