మార్కెట్‌‌కు ఆర్‌‌‌‌బీఐ పాలసీ నచ్చలే

మార్కెట్‌‌కు ఆర్‌‌‌‌బీఐ పాలసీ నచ్చలే
  • నిఫ్టీ 181 పాయింట్లు డౌన్‌‌

ముంబై: కిందటి సెషన్‌‌లో పుంజుకున్న నిఫ్టీ, సెన్సెక్స్ గురువారం మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. ఆహార పదార్ధాల ధరలు తగ్గకపోవడంతో వరుసగా తమ 9 వ మీటింగ్‌‌లోనూ వడ్డీ రేట్లను ఆర్‌‌‌‌బీఐ ఎంపీసీ మార్చలేదు. దీంతో మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. సెన్సెక్స్ 582 పాయింట్లు (0.73 శాతం) తగ్గి 78,886 దగ్గర సెటిలయ్యింది. నిఫ్టీ 181 పాయింట్లు నష్టపోయి 24,117 దగ్గర ముగిసింది.

విదేశీ ఇన్వెస్ట్‌‌మెంట్లు మార్కెట్ నుంచి వెళ్లిపోతుండడంతో పాటు, యూఎస్‌‌, యూరోపియన్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతుండడంతో మన మార్కెట్లు కూడా పడుతున్నాయి.  ఎఫ్‌‌ఐఐలు గురువారం నికరంగా రూ.2,626.73 కోట్ల విలువైన షేర్లను అమ్మారు. డీఐఐలు రూ.577 కోట్ల విలువైన షేర్లను కొన్నారు.ఆర్‌‌‌‌బీఐ వడ్డీ రేట్లను మార్చకపోవడంతో పాటు ఇన్‌‌ఫ్లేషన్ అంచనాలను పెంచడం, జూన్ క్వార్టర్‌‌‌‌లో జీడీపీ గ్రోత్‌‌ కొద్దిగానే ఉంటుందని ప్రకటించడంతో మార్కెట్ లాభాల నుంచి నష్టాల్లోకి జారుకుందని  ఎనలిస్టులు పేర్కొన్నారు.