అండర్–19 విమెన్స్ టీ20 వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌లో..న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌కు నైజీరియా షాక్‌‌‌‌‌‌‌‌

అండర్–19 విమెన్స్ టీ20 వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌లో..న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌కు నైజీరియా షాక్‌‌‌‌‌‌‌‌
  •     అండర్–19 విమెన్స్ టీ20 వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌లో సంచలనం

కౌలాలంపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ : క్రికెట్‌‌‌‌‌‌‌‌లో పసికూన జట్టయిన నైజీరియా అతి పెద్ద సంచలనం సృష్టించింది. అండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–19 విమెన్స్‌‌‌‌‌‌‌‌ టీ20 వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌లో అరంగేట్రం చేసిన నైజీరియా మేటి జట్టు న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌ను ఓడించి చరిత్రకెక్కింది. సోమవారం వర్షం అంతరాయం కలిగించిన  గ్రూప్‌‌‌‌‌‌‌‌–సి మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో రెండు రన్స్ తేడాతో కివీస్‌‌‌‌‌‌‌‌పై గెలిచి క్రికెట్‌‌‌‌‌‌‌‌ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. 13 ఓవర్లకు కుదించిన ఈ పోరులో తొలుత నైజీరియా 65/6 స్కోరు చేసింది. కెప్టెన్ లక్కీ పీటీ (19),  లిలియన్ ఉదె (18) రాణించారు. అనంతరం చిన్న టార్గెట్‌‌‌‌‌‌‌‌ ఛేజింగ్‌‌‌‌‌‌‌‌లో న్యూజిలాండ్ అనూహ్యంగా తడబడింది.

13 ఓవర్లు ఆడి 63/6 స్కోరు మాత్రమే చేసి పరాజయం పాలైంది. ఓపెనర్లు ఎమ్మా మెక్‌‌‌‌‌‌‌‌లియోడ్ (3), కేట్ ఇర్విన్ (0) నిరాశపరిచినా.. ఎవ్‌‌‌‌‌‌‌‌ వోలాండ్ (14), అనికా టాడ్ (19), కెప్టెన్ తాష్‌‌‌‌‌‌‌‌ వాకెలిన్ (18) పోరాటంతో  ఆ జట్టు సులువుగానే గెలిచేలా కనిపించింది. కానీ, నైజీరియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పాటు ఫీల్డింగ్‌‌‌‌‌‌‌‌లోనూ ఆకట్టుకున్నారు. ముగ్గురు బ్యాటర్లను రనౌట్ చేశారు. ఇక 12 ఓవర్లకు 57/5 స్కోరుతో నిలిచిన కివీస్‌‌‌‌‌‌‌‌కు ఆఖరి ఓవర్లో 9 రన్స్ అవసరం అయ్యాయి.

 కానీ, చివరి ఓవర్లో  నైజీరియా పేసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లిలియన్ ఉదే మెరుగ్గా బౌలింగ్ చేసి ఆరు రన్స్ మాత్రమే ఇవ్వడంతో నైజీరియా తమ క్రికెట్‌‌‌‌‌‌‌‌ చరిత్రలో నిలిచిపోయే విజయం సొంతం చేసుకుంది. లక్కీ పీటీ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌‌‌‌‌‌‌‌గా నిలిచింది.  నైజీరియాలో ఫుట్‌‌‌‌‌‌‌‌బాల్‌‌‌‌‌‌‌‌, అథ్లెటిక్స్‌‌‌‌‌‌‌‌ ఫేమస్‌‌‌‌‌‌‌‌. క్రికెట్‌‌‌‌‌‌‌‌ను పెద్దగా పట్టించుకోరు. కానీ, ఓ ఐసీసీ టోర్నమెంట్‌‌‌‌‌‌‌‌కు క్వాలిఫై అయిన వెస్ట్ అమెరికా తొలి జట్టుగా నిలిచిన  నైజీరియా అమ్మాయిల టీమ్ ఇప్పుడు ఏకంగా  ఐసీసీ శాశ్వత సభ్య దేశాన్ని ఓడించి ఔరా అనిపించింది. 

కాగా, గ్రూప్‌‌‌‌‌‌‌‌–డిలో జరిగిన మరో మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో ఆస్ట్రేలియా 2 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌ను ఓడించి  సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–6 రౌండ్‌‌‌‌‌‌‌‌ బెర్తును దాదాపు ఖాయం చేసుకుంది. గ్రూప్‌‌‌‌‌‌‌‌–బి పోరులో యూఎస్‌‌‌‌‌‌‌‌ఏ అమ్మాయిలు 9 వికెట్ల తేడాతో ఐర్లాండ్‌‌‌‌‌‌‌‌ను  చిత్తు చేసింది.