నైజీరియా ప్రెసిడెంట్‌గా జనరల్ మహమ్మదు బుహారీ రెండోసారి విక్టరీ సాధించారు. మార్కెట్ వర్గాలకు అనుకూలంగా ఉండే అపొజిషన్ లీడర్ అటికు అబూ బాకర్ గెలుస్తాడని అందరూ అనుకున్నారు. అబూబాకర్ గెలిస్తే ఎకానమీ పరుగులు పెడుతుందనుకున్న ఇన్వెస్టర్లకు ఆశాభంగం కలిగింది. ఐదేళ్ల కిందట ప్రెసిడెన్షియల్ ఎన్నికల్లో విజయాన్ని దక్కించుకున్న బుహారీ ఆ ఐదేళ్లూ దేశంలో అవినీతిని అంతం చేయడానికి, దేశ భద్రత పెంపుదలకు కృషి చేశారు. ఈ క్రమంలో ఆర్థిక వ్యవస్థలను పట్టించుకోలేదనే విమర్శలను ఎదుర్కొన్నారు. తాజా ఎన్నికల్లో గెలిచి రెండో విడత పాలనకు రెడీ అయ్యారు బుహారీ. అధికారంలోకి రాగానే 2015లో క్యాపిటల్ కంట్రోల్ మొదలుపెట్టారు. ఆర్థిక వ్యవస్థలోకి విదేశాల నుం చి వస్తున్న, వెళ్తున్న మూలధనాన్ని నియంత్రించారు. దీంతో పెట్టుబడిదారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. తమ డబ్బులు తమ చేతికొస్తాయో రావోనని కంగారు పడ్డారు. ఆ టైంలోనే యూఎస్ డాలర్ పై నిషేధం విధించి, సొంత కరెన్సీ (నైరా) పై దృష్టి పెట్టారు. ఫలితంగా ఫారిన్ కరెన్సీ నిల్వలు భారీగా తగ్గాయి. ఈ నిషేధాన్ని 2016లో ఎత్తేయటాన్ని ఇన్వెస్టర్లు స్వాగతించినా, అప్పటికే జరగరాని నష్టం జరిగి పోయింది.
యూఎస్ డాలర్ తో పోల్చితే ‘నైరా’ వ్యాల్యూ దారుణంగా పడిపోయింది. ఆ మాటకొస్తే బుహారీ ప్రెసిడెంట్ అయినప్పటి నుంచే నైజీరియా స్టాక్ మార్కెట్.. ప్రపంచంలోనే వరస్ట్ పెర్ ఫార్మర్ గా చెడ్డ పేరు మూట గట్టుకుంది. బుహారీ మళ్లీ విజయం సాధించినట్లు రిజల్ట్ రాగానే స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ వారం రోజులు వాయిదా పడినప్పుడు కూడా ఒక్క రోజులోనే 540.6 మిలియన్ యూఎస్ డాలర్లు ఆవిరయ్యాయి. ఆ దెబ్బ నుం చి కోలుకోకముందే ఎన్నికల ఫలితం రూపంలో మార్కెట్‌పై మరో పిడుగు పడింది.
ఈ నేపథ్యంలో బుహారీ ముఖ్యంగా ఎకానమీపై ఫోకస్ పెట్టకతప్పదు. రెండో విడతలోనైనా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడతారని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. వాళ్ల ఆకాంక్షల్ని నెరవేర్చాలంటే మార్కెట్ అనుకూల విధానాలను రూపొందిం చాలి. దేశీయంగా వాణిజ్యం , పెట్టుబడులు వృద్ధి చెందాలంటే ఇన్ ఫ్రాస్ట్రక్చర్ రంగంలో ప్రైవేట్ ఇన్వెస్ట్ మెంట్లను ప్రోత్సహించాలి. ప్రభుత్వం ఇప్పటివరకు రోడ్ల నిర్మాణంలో మాత్రమే ఈ సెక్టార్ కి అనుమతిస్తోం ది. ఇకపై రైల్వే లతోపాటు ఇతర రంగాల్లో నూ ప్రైవేట్ పెట్టుబడులకు పచ్చ జెండా ఊపాలి. బుహారీ ఈ రంగంలో విజయం సాధిస్తే ఫైనాన్ షియల్ సెక్టార్ లో స్థిర అభివృద్ధికి దోహదపడుతుంది. ఎందుకంటే, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ నైజీరియా గవర్నర్ గాడ్విన్ ఎమెఫీలేకి పదవీ గండం తలెత్తే ప్రమాదం లేదు. తాను గెలిస్తే గాడ్విన్ని ఆ పోస్టు నుంచి తీసిపారేయటం తథ్యమని ప్రతిపక్ష నేత అబుబాకర్ ఎన్నికల ప్రచారంలో బెదిరించారు. బుహారీ ఇలాంటి హామీలేమీ ఇవ్వలేదు. అంతేకాదు. జూన్‌లో రిటైర్ కానున్న గాడ్విన్కి మరోసారి ఛాన్స్ ఇచ్చే సూచనలు ఉన్నాయి. ఇదే జరిగితే ఫైనాన్ షియల్ మార్కెట్లకు సపోర్ట్ లభించినట్లే. దీంతోపాటు మానిటరీ, ఎక్స్ఛేంజ్ రేట్ పాలసీల్లో పెను మార్పులు జరగకపోవచ్చు.
ఇండస్ట్రియల్ సెక్టార్‌లోనూ మేజర్ మార్పులు చోటు చేసుకోవు. బుహారీ సర్కారు ఎంప్లాయ్ మెంట్ అవకాశాలను మెరుగుపరచటం కోసం మాన్యుఫాక్చరింగ్ సెక్టార్‌కి బలమైన పునాదులు వేయాల్సి ఉంది. నైజీరియాలో నెలకొన్న అధిక ద్రవ్య లోటు, అప్పులు, అవినీతిని కంట్రోల్ చేయడంతోపాటు ఇన్వె స్టర్ల నమ్మకాన్ని దెబ్బ తీయకుండా చూసుకోవాలి. దీనికోసం ప్రభుత్వం అనుభవజ్ఞు లైన పాలసీ అడ్వైజర్లను నియమించుకో వాలి. బుహారీ తన మొదటి ఐదేళ్ల పాలనలో ఇవేవీ పట్టించుకో నందున ఇన్వె స్టర్లలో కొంత అయోమయం ఏర్పడిన మాట వాస్తవం. గవర్నమెంట్ ప్రకటించబోయే కొత్త పాలసీలకు ఇటు జనంలోనూ, అటు ఇన్వె స్టర్లలోనూ క్రెడిబిలిటీ ఉండాలంటే… కేబినె ట్ని రీషఫుల్ చేసుకోవాలి. కీలక శాఖలను సమర్థులకు అప్పజెప్పా లి. ప్రపంచ బ్యాం క్ నిర్దేశించిన ఆరు ప్రమాణాలను అందుకుం టేనే ఆ దేశం నిలబడగలదు. ఆ తర్వా త పరుగు అందుకోగలదు. ఇన్ని సమస్యలతో సతమతమవుతున్నా నైజీరియా ఇప్పటికీ ఆఫ్రికా ఖండంలో అతి పెద్ద ఎకానమీయే. చమురు ఉత్పత్తిలో ఆ దేశమే పెద్దది. ఈ ప్రత్యేకతలను ఇకపైనా నిలబెట్టుకోవాలి.