హైదరాబాద్ లో డ్రగ్స్ విక్రేతలు రెచ్చిపోతున్నారు. గుట్టు చప్పుడు కాకుండా యువతకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. కొందరు నైజిరియా దేశస్తులు నగరంలో ఉంటూ.. పోలీసుల కళ్లుగప్పి డ్రగ్స్ దందా నడిపిస్తున్నారు.
సోమవారం (జూన్3) ఫిలింనగర్ లో డ్రగ్స్ అమ్ముతున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితుడి నుంచి 16 గ్రాముల కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు. కొకైన్ అమ్ముతున్న నైజీరియా దేశానికి చెందిన కాస్మోస్ అలియాస్ ఆండీని పోలీసులు అరెస్ట్ చేసి ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
నగరంలోని నలుగురు యువకులకు ఆండీ రెగ్యులర్ గా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఫిలింనగర్ పోలీ సులు.