ఫేస్​బుక్​లో ఫేక్​ ప్రొఫైల్స్​తో ట్రాప్​.. నైజీరియన్ గిఫ్ట్స్ గ్యాంగ్ అరెస్ట్

  •     ఢిల్లీలో అరెస్ట్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు : గిఫ్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, లాటరీల పేరుతో సైబర్ మోసాలకు పాల్పడుతున్న నైజీరియన్ చిబుజో గాడ్విన్ అలియాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాబీని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోయిన నెల 31న ఢిల్లీలో అదుపులోకి తీసుకుని హైదరాబాద్​కు తీసుకొచ్చారు. మంగళవారం కోర్టులో ప్రొడ్యూస్ చేసి రిమాండ్​కు తరలించారు. కేసు వివరాలను ఏసీపీ కేవీఎం ప్రసాద్ వెల్లడించారు. వెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్రికాకు చెందిన బకాయోకో లస్సినా, మేఘాలయకు చెందిన షోమా పుర్కాయస్థ అలియాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షోమ ప్రసాద్ లు గిఫ్ట్స్ పేరుతో సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు.

గిఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పంపిస్తున్నామంటూ పోయిన ఏడాది ఓ మహిళ వద్ద నుంచి రూ.1.22 కోట్లు వసూలు చేశారు. బాబీ ఇక్కడి నుంచి బ్యాంక్ అకౌంట్స్, మొబైల్ నెంబర్లు నైజీరియాలో ఉంటున్న సెక్యూరో, ఓక్వుచుక్వులు పంపించేవాడు. ఫిబ్రవరిలో వీరిద్దరిని అరెస్ట్ చేశారు. వాళ్లిచ్చిన సమాచారంతో దర్యాప్తు చేశారు. ఫేక్ బ్యాంక్ అకౌంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, గిఫ్ట్స్ వచ్చాయంటూ బల్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎస్​ఎంఎస్​లు పంపిస్తున్న నైజీరియన్ గ్యాంగ్ కోసం సెర్చ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు.

సైబర్ చీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 20 % కమీషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 

నైజీరియాకు చెందిన చిబుజో గాడ్విన్ (42) యూఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, యూకేకు చెందిన వారి పేర్లతో ఫేక్ ఫేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బుక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రొఫైల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్రియేట్ చేశాడు. ఫేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బుక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇండియన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టి.. రిప్లై ఇచ్చిన వారితో చాటింగ్ చేస్తాడు. ఆ తర్వాత అపోజిట్ సెక్స్ పేరుతో ట్రాప్ చేసేవాడు. నమ్మకం పెంచుకున్నాక గిఫ్ట్స్, గోల్డ్​ ఆర్నమెంట్స్, ఎలక్ట్రానిక్స్​ ఐటెమ్స్​ పంపిస్తున్నానని నమ్మబలికేవాడు. ఆ తర్వాత కస్టమ్స్ డ్యూటీ, ఆర్బీఐ, జీఎస్​టీ, కస్టమ్స్ చార్జీల పేరుతో డబ్బులు వసూలు చేసేవాడు. చీటింగ్ చేసిన డబ్బులో 20% కమీషన్​ తీసుకునేవాడు. ఢిల్లీలో గాడ్విన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను గుర్తించిన పోలీసులు మార్చి 31న అరెస్ట్ చేసి ట్రాన్సిట్ వారెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై హైదరాబాద్ తీసుకొచ్చారు.