ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆదివారం రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. చిరు వ్యాపారులు ఇబ్బంది పడ్డారు. డబ్బా కొట్లు గాలికి కిందపడ్డాయి. పలుచోట్ల చెట్ల కొమ్మలు విరిగి రోడ్డు మీద పడడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. కరెంట్ స్తంభాలు విరిగిపడ్డాయి.
కొన్ని ప్రాంతాల్లో కరెంటు సరఫరా నిలిచిపోయింది. రేకుల ఇండ్ల పై కప్పులు గాలికి లేచి కిందపడ్డాయి. కరకగూడెం మండలం రేగుళ్ల గ్రామానికి చెందిన గోగు రాంబాబుకు చెందిన రెండు ఎద్దులపై పిడుగు పడడంతో చనిపోయాయి. - వెలుగు, నెట్వర్క్