హైదరాబాద్‌లో నియమాలకు విరుద్దంగా నడుపుతున్న దుకాణాలు, హోటల్స్‌ను పోలీసులు తనిఖీ చేశారు. ఆదివారం ( నవంబర్ 24) రాత్రి బార్కాస్నుంచి పహాడీషరీఫ్వరకు హోటల్స్ ను పోలీసులు సోదాలు చేశారు. ఈ సోదాల్లో తలుపులు మూసేసి రాత్రంతా హోటల్స్ ను నడుపుతూ..
ఫుడ్ సరఫరా చేస్తున్నారని పోలీసులు గుర్తించారు. నిర్వాహకులతో పాటు కష్టమర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ప్రభుత్వ నియమాలకు విరుద్దంగా.. రాత్రి పూట హోటల్స్ నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హోటల్ యజమానులను హెచ్చరించారు.