48 గంటలు ఆస్పత్రి లిఫ్ట్ లో చిక్కుకున్న వ్యక్తి.. ఫోన్ లేదా.. ఎవరూ ఎందుకు చూడలేదు..?

పది నిమిషాలు లిఫ్ట్ ఆగితేనే ఎక్కేవాళ్లకు.. దిగే వాళ్లకు తెలుస్తుంది.. అందులోనూ ఆస్పత్రి లిఫ్ట్ అంటే 24 గంటలూ రోగులు, వారి బంధువులు, డాక్టర్లు, నర్సులు ఇలా ఎంతో మంది ఎక్కుతుంటారు.. దిగుతుంటారు.. అలాంటి ఆస్పత్రి లిఫ్ట్ లో ఓ వ్యక్తి 48 గంటలు చిక్కుకుపోయాడు.. అలా ఎలా జరిగింది. అతని దగ్గర ఫోన్ లేదా.. ఆస్పత్రిలో ఎవరూ గమనించలేదా.. ఆ 48 గంటలు లిఫ్ట్ లోని వ్యక్తి ఎలా బతికాడు.. ఎలా ఉన్నాడు.. ఈ పూర్తి వివరాలు చూద్దాం...

అది కేరళలోని ఉల్లూర్ లో ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజ్.. రవీంద్రన్ నాయర్ అనే ఓ వ్యక్తి ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళటం కోసం లిఫ్ట్ ఎక్కాడు. అయితే, పైకి వెళ్లాల్సిన లిఫ్ట్ కాస్తా, కిందకు వచ్చింది. లిఫ్ట్ డోర్స్ కూడా ఓపెన్ కాలేదు,...ఏం జరుగుతుందో  రవీంద్రన్ కి అర్థం కాలేదు. పైగా అతని ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయ్యింది. హెల్ప్, హెల్ప్ అంటూ గట్టిగా అరిచాడు కానీ, అతని ఆర్తనాదాలు పట్టించుకున్న వారే లేరు... చేసేదేమి లేక ప్రాణభయంతో బిక్కు బిక్కుమంటూ 48 గంటల పాటు లిఫ్ట్ లోనే గడిపాడు రవీంద్రన్.

Also Read:పూరీ రత్నభాండాగారం ఓపెన్..పెట్టెల నిండా నగలు.!

మెడికల్ చెకప్ కోసం హాస్పిటల్ కి వెళ్లిన రవీంద్రన్ ఓపీ బ్లాక్ లోని లిఫ్ట్ లో చిక్కుకుపోయాడు. హాస్పిటల్ కి వెళ్లిన వ్యక్తి ఇంటికి రాకపోవటంతో ఆదివారం రాత్రి అతని కుటుంబ సభ్యులు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. శనివారం రవీంద్రన్ లిఫ్ట్ లో చిక్కుకుపోయి సోమవారం వరకు అక్కడే ఉన్నాడు. సోమవారం లిఫ్ట్ ఆపరేటర్ లిఫ్ట్ ను ఆన్ చేయటంతో రవీంద్రన్ అక్కడి నుండి బయటపడ్డాడు.