అతడో ప్రభుత్వ టీచర్.. ఎన్నికల సమీపిస్తున్న వేళ.. పోలింగ్ విధులకు శిక్షణ తీసుకునేందుకు రావాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ట్రైనింగ్ కు ఆ టీచరు హాజరు కాలేదు. ఎందుక రాలేదో సమాధానం చెప్పాలని ఉన్నతాధికారులు వివరణ కోరారు..దీంతో ఆ టీచర్ వివరణ ఇస్తూ రాసిన లెటర్ చూసి అవాక్కయ్యారు. వివరణ విషయం పక్కన పెడితే ఉన్నతాదికారులను అతడు కోరిన డిమాండ్ చూసి ముక్కున వేలేసుకున్నారు. వివరాల్లోకి వెళితే..
మధ్యప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్నికల విధుల శిక్షణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు ఉన్నతాధికారులు. సాత్నా జిల్లాలోని అమర్ పతన్ మహుదర్ ప్రభుత్వ పాఠశాలలో టీచర్ గా విధులు నిర్వహిస్తున్న అఖిలేష్ కుమార్ తివారీకి కూడా ట్రైనింగ్ కు వెళ్లాల్సి ఉండగా.. వెళ్లలేదు.. శిక్షణ తరగతులకు గైర్హాజరు అయినందుకు అఖిలేష్ కు నోటీసులు పంపించారు ఉన్నతాధికారులు. అఖిలేష్ ఇచ్చిన సమాధానం, డిమాండ్లను చూసిన బిత్తర పోయారు.
తనకు 35 యేళ్లు వచ్చినా ఒంటరిగా ఉన్నానని.. ఎన్నో రాత్రులు వృధా అవుతున్నాయని.. తనకు వెంటనే పెళ్లి చేస్తే గానీ విధులకు హాజరు కాలేను అని ఉన్నతాధికారులకు వివరణ లెటర్ రాశాడు. అంతేకాదు.. తనకు 35 లక్షల డౌరీ ఇస్తే దీవుల్లో ఎంజాయ్ చేస్తానని.. ఒక ప్లాట్ కూడా ఇప్పించాలని డిమాండ్ చేశాడు.. టీచర్ అఖిలేస్ లెటర్ చూసిన ఉన్నతాధికారులు అవాక్కయ్యారు.
మరో విషయం కూడా వెల్లడించాడు.. తనకు చేయి విరిగిందని.. వెన్నెముక సంబంధిత వ్యాధులు కూడా ఉన్నాయని అఖిలేష్ లేఖలో పేర్కొనడం అందరినీ ఆశ్చర్యపర్చింది. అఖిలేష్ ఈ లేఖను ఉన్నతాధికారుల పంపుతూ సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశారు.. దీంతో ఇది వైరల్ గా మారింది.
ఇంకేముందు టీచర్ అఖిలేష్ కుమార్ తివారీ ని సస్పెండ్ చేసి మచ్ గావ్ బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కు అటాచ్ చేశారు.