హైదరాబాద్: గాడియం స్పోర్టోపియాలో జరిగిన ఐదో ఎడిషన్ -జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్‌లో నిహాల్, అవని సింగిల్స్ టైటిల్స్ గెలుచుకున్నారు. అండర్–15 బాయ్స్ సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ నిహాల్ 21–-19, 21–-17తో తనీశ్ రెడ్డిని వరుస గేమ్స్‌లో ఓడించాడు.
గర్ల్స్ ఫైనల్లో అవని 21–-11, 21–-17తో మాన్య అగర్వాల్ పై విజయం సాధించింది. మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్లో అక్షత్ రెడ్డి– దేవిక ఆదిశ్య 21-–18, 21-–16తో రోహన్– ధృతి సహస్రపై గెలిచి విజేతలుగా నిలిచారు. ఇండియా యంగ్ షట్లర్ ప్రియాన్షు రజావత్, గాడియం ఫౌండర్– డైరెక్టర్ కీర్తి రెడ్డి కలిసి విన్నర్లకు ట్రోఫీలు అందజేశారు.