పబ్‎లో ప్రముఖులు.. లైవ్ అప్‎డేట్స్

ర్యాడిసన్ బ్లూ హోటల్ లోని పుడింగ్ మింక్ పబ్ డ్రగ్స్ కేసుకు సంబంధించిన విచారణ కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించి ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. బంజారాహిల్స్ పోలీసులు శనివారం రాత్రి ర్యాడిసన్ బ్లూ హోటల్ పై దాడి చేశారు. హోటల్ లో ఉన్న ఫుడింగ్ మింగ్ పబ్ ను సమయానికి మించి నడుపుతున్నట్లు గుర్తించిన పోలీసులు.. 148 మంది పబ్ లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అయితే.. పబ్ లో ఉన్నవాళ్లు డ్రగ్స్ తీసుకొచ్చినట్లు ఎలాంటి ఆధారాలు లేవని చెప్పారు. 

నా కూతురుపై వచ్చిన వార్తల్ని ఖండిస్తున్నా.. రేణుకా చౌదరి

పుడింగ్ మింక్ పబ్ తో తన కుమార్తె తేజశ్వినికి సంబంధాలు ఉన్నట్లు వస్తున్న వార్తలను ఖండిస్తున్నాని మాజీ ఎంపీ రేణుకా చౌదరి తెలిపారు. శనివారం రాత్రి బంజరాహిల్స్ లోని రాడిసన్ బ్లూ హోటల్‌ పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. అందులోని పుడింగ్ మింక్ పబ్ లో డ్రగ్స్ దందా నడుస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో ఆ పబ్ రేణుకా చౌదరి కూతురు తేజశ్వినిదేనంటూ కొన్ని మీడియా సంస్థల్లో ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఆదివారం రేణుకా చౌదరి మీడియాతో మాట్లాడుతూ... తన కుమార్తెపై వచ్చిన వార్తలు అవాస్తమని కొట్టిపారేశారు. ఈ విషయమై తన కుమార్తెను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేసినట్లు ప్రచారం జరిగిందని, అది నిజం కాదన్నారు. తన కుమార్తె ‘ఫుడింగ్ మింక్’ పబ్‌ ఓనర్‌ కాదని పేర్కొన్నారు. ఫుడింగ్‌ మింక్‌ పబ్‌తో తన కూతురికి ఎలాంటి సంబంధం లేదన్నారు. నిన్న ఫుడింగ్ మింక్ పబ్‌ దగ్గర తేజశ్విని లేదని రేణుకాచౌదరి స్పష్టం చేశారు. దయచేసి తమ కుటుంబ గౌరవానికి భంగం కలిగేలా అసత్య ప్రచారం చేయొద్దని మీడియాను కోరుతున్నట్లు చెప్పారు. 

నాకు డ్రగ్స్ అలవాటు లేదు: రాహుల్ సిప్లిగంజ్

బంజారాహిల్స్ లోని రాడిసన్ పబ్ లో  డ్రగ్స్ కేసుకు  తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు సింగర్ రాహుల్ సిప్లీగంజ్. డ్రగ్స్ గురించి తనకు ఏమీ తెలియదన్నారు. డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న తాను..డ్రగ్స్ ఎందుకు తీసుకుంటానన్నారు. ఫ్రెండ్ బర్త్ డే పార్టీ ఉంటే పబ్ కు వెళ్లానని.. తనకు డ్రగ్స్ తీసుకునే అలవాటు లేదన్నారు. అవసరమైతే టెస్టులకు సిద్ధమన్నారు. పబ్ నుంచి బయటకు వచ్చే సమయానికి పోలీసులు వచ్చి అడ్డుకున్నారన్నారు. సమయానికి మించి పబ్స్ నడిపితే వాటి యజమాన్యంపై చర్యలు తీసుకోవాలి కానీ..తమను ఇబ్బంది పెట్టడమేంటని ప్రశ్నించారు రాహుల్. పోలీసులు ఎప్పుడు పిలిచినా విచారణకు వెళ్తానన్నారు. 

పబ్ లో ఉన్నవాళ్లు డ్రగ్స్ తీసుకొచ్చినట్లు ఆధారాల్లేవ్

బంజారాహిల్సి  రాడిసన్ పబ్ లో  రెయిడ్ టైంలో 148 మంది ఉన్నారన్నారు వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్.  తెల్లవారుజామున 1 తర్వాత  ఫుడ్డింగ్ అండ్ మింగ్ పబ్ లో సోదాలు చేశామన్నారు. టైం ముగిసిన తర్వాత కూడా పబ్ ను నడిపించారన్నారు. పబ్ లలో  ఒంటి గంట  వరకే  ఫుడ్ అనుమతి ఉందన్నారు. పబ్ మేనజర్స్ పై   కేసుపెట్టామన్నారు.  జనరల్ మేనేజర్ డెస్క్ దగ్గర  డ్రగ్స్ ప్యాకెట్లు దొరికాయన్నారు. 5 ప్యాకెట్ల కొకైన్ దొరికిందన్నారు. మొత్తం 5 గ్రాముల కొకైన్ ను సీజ్ చేశామన్నారు.  పబ్ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేశామన్నారు.మరో  నిందితుడు అర్జున్ మాచినేని పరారీలో ఉన్నాడన్నారు.

కస్టమర్ల డీటేయిల్స్ అన్నీ తీసుకున్నామన్నారు. పబ్ లో ఉన్నవాళ్లు డ్రగ్స్ తీసుకొచ్చినట్లు ఆధారాల్లేవన్నారు. పబ్ జనరల్ మేనేజర్ సహకరించడం లేదన్నారు. జనరల్ మేనేజర్ సహకరిస్తే వివరాలు తెలుస్తాయన్నారు. జనరల్ మేనేజర్ 6 నెలల క్రితమే ఈ పబ్ లో చేరారన్నారు. పబ్ లో ఉన్న వాళ్లు డ్రగ్స్ తీసుకున్నారనే వివరాలు కూడా తెలియవన్నారు. పబ్ లో ఉన్నవాళ్ల శాంపిళ్లు తీసుకోలేదన్నారు.స్పెషల్ గా యాప్ పెట్టి  పబ్ కు వచ్చేవాళ్ల వివరాలను  నమోదు చేస్తున్నారన్నారు. ఓటీపీ చెబితేనే  పబ్ లోకి అనుమతిస్తున్నారన్నారు.

డ్రగ్స్ కేసులో కొత్త కోణం... కోడ్ లాంగ్వేజీ ద్వారా డ్రగ్ డీలింగ్?

డ్రగ్స్ సప్లై వ్యవహారంలో కునాల్, వంశీధర్ రావుల పాత్ర ఉన్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలినట్టు సమాచారం. కునాల్ కు డ్రగ్స్ పెడలర్లతో లింకులు ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. మూడో వ్యక్తికి అర్థంకాకుండా పక్కాగా కోడ్ లాంగ్వేజ్ వాడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బ్రో, స్టఫ్, సోడా, కూల్ వంటి కోడ్ పదాలు వాడినట్లు పోలీసుల విచారణలో తేలింది. పోలీసులు పబ్ లోకి రాగానే డ్రగ్ సేవిస్తున్న వారిని కునాల్ అనే వ్యక్తి కోడ్ లాంగ్వేజీ ద్వారా అలెర్ట్ చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే 142మంది పబ్ లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు వారి జాబితాను రిలీజ్ చేశారు. కాగా.. అందులో ఎంతమందికి డ్రగ్స్ ముఠాతో సంబంధం ఉంది, డ్రగ్స్ ఎవరు సరఫరా చేశారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. 

బంజరాహిల్స్ కొత్త సీఐగా నాగేశ్వర్ రావు

బంజారాహిల్స్ పీఎస్ కు కొత్త సీఐగా నాగేశ్వర్ రావును ప్రభుత్వం నియమించింది. రాడిసన్ బ్లూ పబ్ డ్రగ్స్ వ్యవహారాన్ని ఇన్ స్పెక్టర్  నాగేశ్వర్ రావు టీమ్ బట్టబయలు చేసింది. ఇప్పుడు ఆయననే బంజరాహిల్స్ సీఐగా పంపుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నాగేశ్వరరావు పై గతంలో ఎన్నో సంచలన కేసులు ఛేదించిన రికార్డ్ ఉంది. 

లిస్టులో కనిపించని నిహారిక పేరు

ర్యాడిసన్ బ్లూ హోటల్ ఫుడ్డింగ్ అండ్ మింగ్ పబ్ కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. 142 మంది ఈవెంట్ లో పాల్గొన్నట్లు లిస్ట్ విడుదల చేశారు పోలీసులు. లిస్ట్ లో రాహుల్ సిప్లిగంజ్, గల్లా సిద్ధార్థ్ తో పాటు పలువురు ప్రముఖుల పేర్లు ఉన్నాయి. అయితే నాగబాబు కూతురు కొణిదెల నిహారిక పేరు లిస్ట్ లో లేదు. నిహారిక ఈవెంట్ లో పాల్గొన్నది నిజమే అని నాగబాబు కాసేపటి క్రితమే వీడియో రిలీజ్ చేశారు. మొత్తం 150మంది ఈవెంట్ లో పాల్గొన్నారని చెప్పారు పోలీసులు. లిస్టులో మాత్రం 142మంది పేర్లను మాత్రమే చేర్చారు. పోలీసులు విడుదల చేసిన లిస్ట్ లో ఇంకా 8మంది పేర్లు మిస్ అయ్యాయి. ఆ ఎనిమిది మంది ఎవరనేది చర్చనీయాంశం అయింది.  పోలీసులు కావాలనే కొందరు ప్రముఖుల పిల్లల పేర్లను లిస్ట్ నుంచి తప్పించినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

పబ్ లో ఉన్న 142 మంది లిస్టు రిలీజ్ 

ర్యాడిసన్ బ్లూ హోటల్.. ఫుడ్డింగ్ అండ్ మింక్ పబ్ ఈవెంట్ పై పోలీసుల విచారణ కొనసాగుతోంది. 142మంది ఈవెంట్ లో పాల్గొన్నట్లు లిస్ట్ విడుదల చేశారు పోలీసులు. పబ్ ను తనిఖీలు చేస్తున్నారు. నిన్న ర్యాడిసన్ బ్లూ హోటల్ లో విధుల్లో ఉన్న సిబ్బందిని విచారిస్తున్నారు పోలీసులు. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ ఎక్కడి వచ్చాయో విచారిస్తున్నారు. ఈవెంట్ ను ఆర్గనైజ్ చేసింది.. వీఐపీలను ఆర్గనైజ్ చేసిందెవరనే దానిపై ఆరా తీస్తున్నారు.

డ్రగ్స్ తో నిహారికకు ఎలాంటి సంబంధం లేదు: నాగబాబు

రాడిసన్‌ బ్లూ పబ్‌ వ్యవహారంలో తన కుమార్తె నిహారికపై వస్తున్న వార్తలపై నటుడు నాగబాబు స్పందించారు. పోలీసులు పబ్ పై దాడి చేసినప్పుడు పబ్ లో తన కూతురు నిహారిక ఉన్నది నిజమేనని, కానీ తనకు డ్రగ్స్ తో ఎలాంటి సంబంధంలేదని క్లారిటీ ఇచ్చారు. పరిమిత సమయాన్ని మించి నడుపుతుండటంతో పోలీసులు పబ్‌పై యాక్షన్ తీసుకున్నారని తెలిపారు. పోలీసులు తమకు ఇచ్చిన సమాచారం మేరకు.. నిహారిక విషయంలో ఎటువంటి తప్పు లేదని చెప్పినట్లు నాగబాబు స్పష్టం చేశారు. దీనిపై  మీడియాలో ఎలాంటి ఊహాగానాలకు తావు ఇవ్వొద్దని కోరారు.

కావాలనే నన్ను బద్నాం చేస్తున్నారు: హేమ

కొందరు తన పేరును కావాలనే ప్రచారం చేస్తున్నారని సినీ నటి హేమ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ముందు హల్ చల్ చేశారు . డ్రగ్స్ కేసుతో  తనకు సంబంధం లేకున్నా.... కొంతమంది కావాలనే తనను బద్నాం చేస్తున్నారని మండిపడ్డారు. దీనిపై పీఎస్ లో కంప్లైంట్ చేస్తామన్నారు హేమ .తాను పబ్ కే వెళ్లలేదన్నారు.

గల్లా అశోక్‎పై అసత్య ప్రచారం
శనివారం రాత్రి హైదరాబాద్‎లోని ఫుడింగ్ మింగ్ పబ్ పై పోలీసులు జరిపిన రైడ్‎లో గల్లా అశోక్ పేరు కూడా జత చేసి కొన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రసారం చేస్తున్నాయి. ఈ వ్యవహారంలో గల్లా అశోక్‎కి ఎలాంటి సంబంధం లేదు. దయచేసి ఇలాంటి నిరాధారమైన వార్తలని మీడియాలో ప్రసారం చెయ్యొద్దని ఆయన కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.

డ్రగ్స్ అమ్మేవారిని ఎన్‎కౌంటర్ చేస్తే మద్దతిస్తాం
సీఎం కేసీఆర్‎కు  చిత్తశుద్ధి ఉంటే  డ్రగ్స్ కేసులో  పూర్తిస్థాయి విచారణ  జరిపించాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. రెండురోజులు హడావుడి చేసి కేసును వదిలేయొద్దన్నారు.  డ్రగ్స్ కొనేవారిని, అమ్మేవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అవసరమనుకుంటే డ్రగ్స్ అమ్మేవారిని ఎన్‎కౌంటర్ చేయాలన్నారు.  ఈ విషయంలో  కేసీఆర్‎కు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని రాజాసింగ్ అన్నారు.

పబ్ ఓనర్ ఓ మాజీ ఎంపీ కూతురు
ర్యాడిసన్ హోటల్ లోని ఫుడింగ్ మింగ్ పబ్ ఖమ్మం జిల్లాకు చెందిన ఓ మాజీ ఎంపీ కూతురుదని తెలుస్తోంది. పోలీసులు ఇప్పటికే పబ్ నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ ఎక్కడి నుండి తెచ్చారు..?? ఎవరెవరి ఇన్వాల్వ్‎మెంట్ ఉంది..?? ఈ పార్టీకి వీఐపీలను ఎవరు కోఆర్డినెట్ చేశారు..?? ఈ విషయాలపై ఒకటికి రెండు సార్లు అన్ని కోణాల్లో పోలీసులు క్రాస్ చెక్ చేస్తున్నారు.

నిహారికను తప్పించే ప్రయత్నం.. సీఐపై వేటు
బంజారాహిల్స్ పబ్ కేసు కీలక మలుపు తిరిగింది. ప్రముఖులు, సినీ నటులను వదిలిపెట్టడంపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. సినీ నటి నిహారికను పీఎస్ కు తీసురాకుండా బయటకు పంపించడంతో బంజారాహిల్స్ సీఐ శివచంద్రపై సస్పెన్షన్ వేటు పడింది. వెంటనే నిహారికను పీఎస్ కు తీసుకువచ్చి విచారించారు. అనంతరం ఆమెకు నోటీసులు ఇచ్చి పంపించారు. అలాగే పోలీసుల అదుపులో  ఉన్న రాహుల్ సిప్లిగంజ్ ను విచారించి నోటీసులు ఇచ్చి పంపించారు. ఈ కేసులో ఏసీపీ సుదర్శన్ కు ఛార్జ్ మెమో దాఖలు చేశారు. కేసులో ఇప్పటి వరకు ముగ్గురిని అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిలో ఈవెంట్ ఆర్గనైజర్స్, పబ్ నిర్వాహకులు ఉన్నారు. డ్రగ్స్ ఎక్కడ నుంచి తెచ్చారనే కోణంలో విచారిస్తున్నారు ఉన్నతాధికారులు. VIP లను ఎవరు కో ఆర్డినేట్ చేశారనే కోణంలో ఆధారాలు సేకరిస్తున్నారు. పక్కా సమాచారంతో పబ్ పై పోలీసులు దాడి చేసినట్టు తెలుస్తోంది. 

పబ్ కేసులో నిహారిక
బంజారాహిల్స్ పోలీసులు శనివారం రాత్రి ర్యాడిసన్ బ్లూ హోటల్ పై దాడి చేశారు. ఈ దాడులలో సింగర్ రాహుల్ సిప్లిగంజ్‎తో పాటు నాగబాబు కూతురు నిహారిక కూడా ఉన్నట్లు తేలింది. ఆమె ఎవరికంటా పడకుండా పోలీసులు స్టేషన్ నుంచి ఇంటికి పంపించారు. ఈ విషయం బయటకు రావడంతో నిహారికను స్టేషన్ కు తీసుకొచ్చి విచారించారు. అనంతరం నోటీసులిచ్చి పంపించారు.

రాహుల్ సిప్లిగంజ్‎కు నోటీసులు
బంజారాహిల్స్ పోలీసులు శనివారం రాత్రి ర్యాడిసన్ బ్లూ హోటల్ పై దాడి చేశారు. ఈ దాడులలో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. హోటల్ లో ఉన్న ఫుడింగ్ మింగ్ పబ్ ను సమయానికి మించి నడుపుతున్నట్లు గుర్తించిన పోలీసులు.. రాత్రి 3 గంటల సమయంలో దాడులు చేసి యజమానులతో సహా సుమారు 150 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరందరినీ బంజారాహిల్స్ పీఎస్ కు తరలించారు. అయితే పోలీసులు తీసుకొచ్చిన యువకులు పోలీసు స్టేషన్ లో హంగామా సృష్టించారు. తమను ఎందుకు తీసుకొచ్చారంటూ ఆందోళన చేశారు. పోలీసులు అదుపులోకి తీసుకున్నవారిలో ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అందరినీ విచారించి, నోటీసులిచ్చి ఇచ్చి పంపిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా.. బంజారాహిల్స్ పీఎస్ నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెల్లుతున్నాయి. పోలీస్ స్టేషన్‎కు కూతవేటు దూరంలో ఉన్న ర్యాడిసన్ పబ్ మీద స్థానికులు గతంలోనే ఫిర్యాదు చేశారు. పబ్ మాజీ ఎంపీ కూతురుది కావడంతో పోలీసులు చూసి చూడనట్లు వదిలేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. రాత్రి మూడు గంటల వరకు పబ్ నడిచినా.. ఆ వైపు కనీసం కన్నెత్తి కూడా చూడరని బంజారాహిల్స్ పోలీసులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.