ఆంద్రప్రదేశ్ ఎన్నికల కారణంగా మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ మధ్య విభందాల వార్తలు మరోసారి తెరపైకి వచ్చాయి. అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ కి కాకుండా వైసీపీ సపోర్ట్ గా నిలవడం అనేది చాలా మందికి నచ్చలేదు. అందుకే మెగా ఫ్యామిలీ అల్లు అర్జున్ పై కోపంగా ఉండనే వార్తలు వచ్చాయి. ఈ కారణంగానే హీరో సాయి ధరం తేజ్ అల్లు అర్జున్ ను సోషల్ మీడియాలో అన్‌ఫాలో చేశాడట. ఈ న్యూస్ కాస్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
ఇదే విషయంపై తాజాగా మెగా డాటర్ నిహారిక స్పందించారు. ఆమె నిర్మాతగా చేస్తున్న లేటెస్ట్ మూవీ కమిటీ కుర్రోళ్లు. అంతా కొత్తవాళ్ళు నటిస్తున్న ఈ సినిమాను దర్శకుడు యధు వంశీ తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదల చేశారు మేకర్స్. ఈ సంధర్బంగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ అన్‌ఫాలో చేయడం గురించి ఒక రిపోర్టర్ ప్రశ్నించారు.
దానికి సమాధానంగా నిహారిక మాట్లాడుతూ.. నాకు అల్లు అర్జున్, సాయిదుర్గ తేజ్ విషయం గురించి తెలియదు. అయినప్పటికీ.. ఎవరి కారణాలు వాళ్లకి ఉంటాయి కదా.. అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆమె చేసిన ఈ కామెంట్స్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక కమిటీ కుర్రోళ్లు సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమా నిర్మాతగా నిహారికకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.