Niharika Konidela: చరణ్‌ అన్న ప్రపంచంలోనే గొప్ప నాన్న..నిహారిక ఆసక్తికర కామెంట్స్

Niharika Konidela: చరణ్‌ అన్న ప్రపంచంలోనే గొప్ప నాన్న..నిహారిక ఆసక్తికర కామెంట్స్

మెగా డాటర్ నిహారిక (Niharika) నిర్మాణ సంస్థ పింక్‌ ఎలిఫెంట్‌ పిక్చర్స్‌, శ్రీ రాధా దామోదర్‌ స్టూడియోస్‌ బ్యానర్స్ పై వస్తున్న కొత్త సినిమా కమిటీ కుర్రాళ్లు (CommitteeKurrollu).క‌మిటీ కుర్రాళ్లు సినిమాతో ఏకంగా ప‌ద‌కొండు మంది హీరోలు, న‌లుగురు హీరోయిన్ల‌ను టాలీవుడ్‌కు ప‌రిచ‌యం చేస్తోంది నిహారిక.ఈ సినిమా ఆగస్ట్ 9న రిలీజ్ అవుతుండటంతో వరుస ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిహారిక మెగా హీరో రామ్ చరణ్(Ram Charan) మరియు తన ముద్దుల డాటర్ క్లింకార(Klin Kaara) మధ్య సాగే ఆ బాండింగ్ ఎలా ఉంటుందో రివీల్ చేసింది. 

‘‘మా ఫ్యామిలీలో ఇప్పుడు అందరి అటెన్షన్ క్లీంకారపైనే. క్లీంకార ముద్దుగా మాట్లూడుతుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది. చాలా అల్లరి చేస్తుంది. చరణ్ అన్నకి క్లీంకార అంటే ప్రాణం. ఇప్పటివరకు నేను చూసిన వాళ్లలో చరణ్‌ అన్న వరల్డ్ లోనే బెస్ట్‌ డాడీ. చరణ్ అన్నయ్య క్లీంకారకు అన్నం తినిపించాడు చాలా కష్టపడతాడు. కుక్కపిల్లల్ని, పక్షుల్ని చూపించి క్లీంకారకు అన్నం పెడతాడు.

ప్రసెంట్ ఇండస్ట్రీలో స్టార్‌ హీరోగా బిజీగా ఉన్నప్పటికీ క్లీంకారతో చాలా సమయం గడుపుతాడు. అసలు చరణ్ అన్నని చూస్తే సినిమాలు లేకుండా కుమార్తెతో గడుపుతున్నాడా అనిపిస్తుందని అన్నారు. కానీ.. తను వర్క్‌లైఫ్‌ను, పర్సనల్‌ లైఫ్‌ను బ్యాలెన్స్ చేసుకుంటాడు. అలాగే, చరణ్ అన్న  నటించిన RRR ఆస్కార్ గెలవడంతో పాటు పవన్ కళ్యాణ్ బాబాయ్ ఎమ్మెల్యేగా గెలవడం క్లీంకార వచ్చాకే జరిగాయి. మా ఇంటికి, మా అందరికి క్లీంకార గోల్డెన్‌ డార్లింగ్‌’ అని నిహారిక వెల్లడించింది.