![Niharika Konidela: చెఫ్ మంత్ర సీజన్ 3 ప్రోమో..నేను మీ నిహారిక..ఆహా అనాలిక](https://static.v6velugu.com/uploads/2024/03/niharika-konidela-chef-mantra-promo-out-in-aha-videoin_nzDPqsK5JT.jpg)
మెగా డాటర్ నిహారిక (Niharika Konidela) ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా కనిపిస్తోంది. మొన్నటి వరకు ఇతర దేశాల్లో ట్రిప్స్ కు వెళ్తూ..లైఫ్ ఎంజాయ్ చేసింది. ఇక ఇప్పుడు యాక్టర్ గా, ప్రొడ్యూసర్ గా, యాంకర్ గా బిజీగా అయింది.
నిహారిక మరోసారి యాంకర్ గా కనిపించబోతుంది. ప్రముఖ తెలుగు ఆహా ఓటిటీలో చెఫ్ మంత్ర అనే కుకింగ్ షోలో యాంకర్ గా అదరగొట్టే పనిలో ఉంది. ఈ చెఫ్ మంత్ర కుకింగ్ షో తెలుగునాట మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఫస్ట్ సీజన్కు యాంకర్గా శ్రీముఖి ఉండగా,రెండో సీజన్ కు మంచు లక్ష్మీ చేసింది. ఇక ఇప్పుడు నిహారిక మూడో సీజన్ లోకి అడుగుపెట్టింది.
లేటెస్ట్గా చెఫ్ మంత్ర (Chef Mantra) ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. నిహారిక అందంగా రెడీ అవ్వడంతో పాటు..తనదైన మాటల చాతుర్యంతో షో మొత్తాన్ని తనవైపు తిప్పుకుంటుందనే విషయం అర్ధం అవుతోంది. 'చెఫ్ మంత్ర సీజన్ 3..నేను మీ నిహారిక..ఆహా అనాలిక' ఈ సారి 'చెఫ్ మంత్ర టోటల్ ఎంటర్ టైన్ మెంట్ జాతర అంటూ అదరగొట్టింది.
ఈ షోలో బలగం బ్యూటీ కావ్య, కలర్ ఫోటో ఫేమ్ చాందినీ చౌదరి..నవదీప్, తేజస్విని..అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్ ఫేమ్ సుహాస్, శరణ్య.. ఇలా వీరందరూ తమ కుకింగ్ టాలెంట్ ను బయటపెట్టడంతో పాటు ఎన్నో కబుర్లు చెప్పుకొచ్చారు.మహిళా దినోత్సవం సందర్బంగా (మార్చి 8న) చెఫ్ మంత్రం మూడో సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్ కానుంది. మరి ఈ షో..మెగా నిహారికకు ఎలాంటి గుర్తింపుని ఇస్తుందో చూడాలి.
నిహారిక ప్రస్తుతం పలు వెబ్ సిరీస్ లతో పాటు మంచు మనోజ్ 'వాట్ ది ఫిష్' మూవీలో నటిస్తుంది. అలాగే పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పై ఒక సినిమా నిర్మిస్తుంది.