
Kaadhal Sadugudu Song : టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్, ప్రొడ్యూసర్ నిహారిక కొణిదెల ప్రస్తుతం "మద్రాస్కారన్" అనే తమిళ్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకి వాలి మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తుండగా బి. నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలోని "కాదల్ సడుగుడు" అనే పాటని ఇటీవలే చిత్ర యూనిట్ యూట్యూబ్ లో రిలీజ్ చేశారు.
ఈ పాటని అప్పట్లో తమిళ్ స్టార్ హీరో మాధవన్, వెటరన్ హీరోయిన్ షాలిని నటించిన సఖి సినిమలోని కైలోవే చేడుగుడు (తెలుగులో అలలే అలలే చిట్టిచిట్టి అలలే) పాటని రీమేక్స్ చేశారు. ఒరిజినల్ ఆస్కార్ అవార్డు గ్రహీత, మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహ్మాన్ కంపోజ్ చెయ్యగా మరో తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ వి.నందగోపాలన్ రీమిక్స్ చేశాడు.
ఈ పాట ప్రస్తుతం యూట్యూబ్ లో టాప్ లో ట్రెండ్ అవుతోంది. అలాగే ఈ పాట రిలీజ్ చేసిన 2 రోజుల్లోనే దాదాపుగా 8 లక్షలపై చిలుకు వ్యూస్ వచ్చాయి. ఇప్పటివరకూ గ్లామర్ పాత్రలకి దూరంగా ఉన్న నిహారిక ఈ పాటలో కొంతమేర బోల్డ్ గా కనిపించింది. దీంతో ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు.
మరికొందరు మాత్రం నటి స్థానంలో ఉన్నప్పుడు పాత్రకి తగ్గట్టుగా కాస్ట్యూమ్స్ ధరించడం, హావభావాలు పలికించడం వంటివి చేయాల్సి ఉంటుందని అందులో తప్పేముందని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అలాగే ఈమధ్య నిహారిక కూడా నటనాపరంగా గేర్ మార్చిందని అందుకే భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల్లో నటించేందుకు ఆఫర్లు యాక్సెప్ట్ చేస్తోంది.
ఈ విషయం ఇలా ఉండగా మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన నిహారిక కొణిదెల 2016లో ప్రముఖ హీరో నాగశౌర్య హీరోగా నటించిన "ఒక మనసు" అనే సినిమా ద్వారా హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. ఈ సినిమా తర్వాత డార్లింగ్, హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం, తదితర సినిమాల్లో నటించింది. కానీ ఈ సినిమాలు పెద్దగా వర్కౌట్ కాలేదు. ఇక కమీటీ కుర్రాళ్ళు అనే సినిమాని నిర్మించగా ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. అలాగే మంచి కలెక్షన్లు రాబట్టింది.
ప్రస్తుతం నిహారిక WTF-వాట్ ది ఫిష్ అనే సినిమలో నటిస్తోంది. ఈ సినిమాని 6ix సినిమాస్ బ్యానర్‌పై విశాల్ బెజవాడ నిర్మిస్తుండగా నూతన దర్శకుడు వరుణ్ కోరుకొండ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాజని ప్యాన్ ఇండియా భాషలలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారు.