
నటిగా కొనసాగుతూనే, నిర్మాతగానూ బిజీ అవుతోంది నిహారిక. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పేరుతో బ్యానర్ ప్రారంభించిన నిహారిక.. ‘కమిటీ కుర్రోళ్లు’ లాంటి సూపర్ హిట్ మూవీని నిర్మించింది. ఇప్పుడు తన సొంత నిర్మాణ సంస్థలో మరో చిత్రాన్ని ఆమె నిర్మించబోతోంది. ఇదే సంస్థలో రెండు వెబ్ సిరీస్‌లకు పనిచేసిన మానస శర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతోంది.
జీ5లో స్ట్రీమింగ్ అవుతున్న ‘ఒక చిన్న ఫ్యామిలీ’ సిరీస్‌కు క్రియేటర్‌గా వర్క్ చేసిన మానస, సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ‘బెంచ్ లైఫ్’ సిరీస్‌కు దర్శకత్వం వహించింది. ఇప్పుడు ఫీచర్ ఫిల్మ్ డైరెక్టర్‌గా ఇదే బ్యానర్‌లో పరిచయం కాబోతోంది. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటించనున్నారు.