సినిమా మేకర్స్.. ఒక విషయాన్ని స్క్రీన్ పై తీసుకురావడానికి చాలా వర్క్ చేస్తారు. ప్రసెంట్ టెక్నాలజీకి సంబంధించిన ప్రతి విషయంపై అవగాహనతో పనిచేస్తారు. కొన్నిసార్లు మేకర్స్ చేసే అద్భుతాలకు ప్రేక్షకులు 'వావ్.. సూపర్బ్' అంటారు. ఇంకొన్ని సార్లు వాళ్లు చేసే అద్భుతాలను సరైన టైంలో గుర్తించలేకపోతారు.
అయితే, ఆలస్యమైన సరే.. ఒక్కసారి ఆ చిత్రాన్ని చూస్తే, మేకర్స్ పనితనాన్ని మెచ్చుకోకుండా అస్సలు ఉండలేరు ప్రేక్షకులు. సరిగ్గా అలాంటి అద్భుతమైన చిత్రాన్నే తీశారు టాలీవుడ్ యువ డైరెక్టర్ M. చిత్రణ్. మెగా డాటర్ నిహారిక ప్రొడక్షన్ హౌస్ : పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పతాకంపై నిర్మించిన ఫస్ట్ ఎవర్ ఇంటరాక్టివ్ స్టోరీ 'అవునా ఐతే ఓకే’ (Avuna Ithe Okay).
తెలుగులో వచ్చిన మొట్టమొదటి ఇంటరాక్టివ్ స్టోరీ (Interactive Story) ఇది. టాలీవుడ్లో ఇలాంటి ప్రయోగం చేసిన జాబితాలో నీహారిక అండ్ టీమ్ నిలిచింది. ప్రస్తుతం 7 ఎపిసోడ్స్తో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ యూట్యూబ్ ఛానల్లో స్ట్రీమ్ అవుతుంది. ఆలస్యం చేయకుండా కథలో కొత్త ఒరవడి తీసుకొచ్చిన ఈ వినూత్న ప్రయోగాన్ని చూసి ఆనందించండి.
అవునా ఐతే Okay విశేషాలు::
ఇంటరాక్టివ్ స్టోరీ.. అంటే కథ ముందుగా నిర్ణయించబడదని అర్థం. కథలో అనేక విభిన్న పాత్రలు, సందర్భాలు ఉంటాయి. కానీ సినిమాను డిజిటల్‌గా చూసే వ్యక్తి ఆ కథలో ఏం జరగాలో నిర్ణయించవచ్చు. ప్రేక్షకుడు నచ్చేలా కథను మార్చుకోవచ్చు. అంటే, 'కథ గమనాన్ని నిర్ణయించేది ప్రేక్షకుడే' అన్నమాట. కథలో హీరో మీరైతే ఏం చేస్తారు? అంటే కథలో పాత్రలను ఎలా ముందుకు నడపాలో కూడా ప్రేక్షకుడి సొంతం.
కొన్ని సినిమాలు చూసినపుడు.. అవి మనకు తెలియకుండానే సొంతమవుతాయి. ఫలానా సినిమాలోని క్లైమాక్స్ ఇలా జరగపోతే బాగుండు అనే సందర్భాలు చాలా మూవీస్ లలో చూస్తూ వస్తున్నాం. ఉదాహరణకు సీతారామం సినిమా చూశాక.. లెఫ్టినెంట్ రామ్ చనిపోకపోతే బాగుండు అనిపిస్తుంది. అతడు తిరిగొచ్చి సీతను కలిసుంటే ఆ క్షణాలే కథకు పరిపూర్ణత ఇచ్చేదేమో అనిపిస్తుంది.
ALSO READ | ఓటీటీలతో వెరీ డేంజర్.. క్రైమ్ పాఠాలు నేర్చుకుంటున్న సమాజం
7/g బృందావన కాలనీ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో మనకు తెలిసిందే. ఈ సినిమాలో అసలు దేనికి పనికి రాడనుకున్న హీరోని.. హీరోయిన్ సోనియా అగర్వాల్ ఒక మంచి మనిషిగా తీర్చిదిద్దుతుంది. అప్పటివరకు ఎంతో ఆసక్తిగా నడుస్తున్న ఈ సినిమా.. క్లైమాక్స్లో మాత్రం హీరోయిన్ చనిపోవడం ప్రేక్షకులను నిరాశకు గురి చేస్తుంది. ఈ "Sad Ending"ను ప్రేక్షకులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. హీరోయిన్ బతికి ఉంటే బాగుండేదని సగటు సినీ అభిమాని కోరుకున్నాడు.
అలాగే, మరికొన్ని సినిమాల్లో 'నచ్చిన హీరోది' లవ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటాం. కానీ, ప్రియురాలు బాధపెడుతుంది. 'నాయకుడు చివర్లో గెలవాలని' అనుకుంటాం. కానీ ఓడిపోతాడు. ఐతే, ఇవన్నీ ఇలానే జరగాలని ఒక దర్శకుడు ఆలోచిస్తే.. కథలో జరుగుతున్నాయి. అదే ప్రేక్షకుడు ఆలోచిస్తే ఆ సినిమా ఇంకెలా ఉంటుందో ఓ సారి ఊహించండి!! అలాంటి ప్రేక్షకుడి ఊహలకి సినిమా దిశను నిర్ణయించే అవకాశాన్ని ఓ యువ దర్శకుడు మనకి ఇచ్చాడు. ప్రేక్షకుడి ఆలోచనతోనే సినిమాను ముందుకే నడిపే గమనాన్ని మన ముందుంచారు. 'అవునా ఐతే ఓకే’మూవీతో కొత్త ప్రయోగం చేశారు ప్రొడ్యూసర్ నీహారిక అండ్ డైరెక్టర్ చిత్రణ్.
అవునా ఐతే ఓకే స్వభావం:
సోఫాలో హాయిగా వెనక్కి వాలి కూర్చుని సినిమా చూసే రోజులు పోయాయి. ఎందుకంటే, సినిమా అనేది కేవలం వినోదం (Entertainment) మాత్రమే కాదు. విద్యాభ్యాసం (Education), జ్ఞానోదయం (Enlightenment) కూడా. ఇవే మనల్ని సంపన్నులని (Enrichments) చేస్తాయి. అలా ప్రేక్షకుడి ఆలోచనతోనే సినిమాను ముందుకు నడిపేలా చేస్తోంది ఈ ఇంటరాక్టివ్ స్టోరీ. ఇలాంటి భిన్నమైన ప్రయోగాన్ని మన మేకర్స్ తెలుగులో రూపొందించడం విశేషం.
ఎందుకంటే, ప్రస్తుతం మన తెలుగు ప్రేక్షకులు సినిమాలను క్షుణ్ణంగా చూడటం మొదలుపెట్టారు. థియేటర్లలో రిలీజైన మొదటి షోతోనే సినిమా భవిష్యత్తును నిర్ణయించే రోజులు కూడా వచ్చాయి.
ఆ తర్వాత సినిమాలో హీరో ఇలా ఉండకూడదు. స్టోరీ ఇలానే తీయాలి, కాన్సెప్ట్ కోసం రచయిత, దర్శకుల కేస్ స్టడీ బాగుంది.. ఇలా పలు విధాలైన ఆలోచనలతో ముందుకెళ్లే స్వభావాలు ఆడియాన్స్లో మొదలయ్యాయి. ఇలాంటి దశలోనే 'అవునా ఐతే ఓకే' లాంటి ఇంటరాక్టివ్ స్టోరీ రావడం ఎంతో ఆదర్శనీయం.
గతంలో నెట్‌ఫ్లిక్స్‌లో రుపొంచిందిన ‘బ్లాక్ మిర్రర్ : బ్యాండర్స్‌నాచ్, యు వర్సెస్ వైల్డ్, జురాసిక్ వరల్డ్ క్యాంప్ క్రెటేషియస్: హిడెన్ అడ్వెంచర్’ వంటి ఇంటరాక్టివ్ స్టోరీస్ ఈ కోవకు చెందినవే. అందువల్ల 'అవునా ఐతే ఓకే’ లాంటి కథలు.. మన తెలుగులో ఇంకా మరిన్ని వస్తే.. దర్శకుల కథల ఎంపిక, ప్రేక్షకుల చైతన్యవంతమైన ప్రతిభ వృద్దిలోకి వస్తాయి.
ఇందులో గుడుంబా శంకర్ మూవీని తెరకెక్కించిన డైరెక్టర్ వీర శంకర్ కీలక పాత్రలో నటించాడు.. ఆయన పాత్ర ఎంతో వైవిధ్యతతో కూడుకుని ఉంటుంది. ప్రస్తుతం డైరెక్టర్ వీర శంకర్ తెలుగు సినీ దర్శకుల సంఘం అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు.