Niharika Konidela: షాకింగ్ ఫొటో షేర్ చేసిన మెగా డాటర్ నిహారిక.. పాదాలు ఏంటి ఇలా అయిపోయాయి?

Niharika Konidela: షాకింగ్ ఫొటో షేర్ చేసిన మెగా డాటర్ నిహారిక.. పాదాలు ఏంటి ఇలా అయిపోయాయి?

మెగా డాటర్ నిహారిక లేటెస్ట్ తన ఇన్ స్టా పోస్ట్ వైరల్గా మారింది. ఇందులో త‌న కాళ్ల‌పై మ‌చ్చ‌ల‌తో ఉన్న ఓ పిక్ షేర్ చేసింది. దానికి 'రిజ‌ల్ట్ ఆఫ్ గ్రేస్ క్లాస్..థ్యాంక్యూ అంటూ శ‌ర‌న్ జిత్ కౌర్‌ని' ట్యాగ్ చేసింది. పాదాలపై ఉన్న చారలు చూస్తుంటే.. నాట్యం నేర్చుకునే క్రమంలో గజ్జలు కట్టుకోవడం వల్ల ఇలా తన పాదాలు కమిలిపోయినట్లు తెలుస్తోంది. ఇక ఈ ఫోటో ఫ్యాన్స్ దృష్టికి రావడంతో, అయ్యో టేక్ కేర్ మేడం అంటూ తన పోస్టుకు కామెంట్స్ పెడుతున్నారు.

నిహారిక సినిమాల విషయానికి వస్తే:

ప్రస్తుతం నిహారిక నటిగా కొనసాగుతూనే, నిర్మాతగానూ బిజీ అవుతోంది. పింక్‌‌ ఎలిఫెంట్‌‌ పిక్చర్స్‌‌ పేరుతో బ్యానర్‌‌‌‌ ప్రారంభించిన నిహారిక.. 2024 లో ‘కమిటీ కుర్రోళ్లు’లాంటి సూపర్ హిట్‌‌ మూవీని నిర్మించింది. రూ.10 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా రూ.25 కోట్లు రాబట్టి తొలి ప్రయత్నంలోనే నిహారిక స‌క్సెస్ అయింది.

ఇప్పుడు తన సొంత నిర్మాణ సంస్థలో మరో చిత్రాన్ని ఆమె నిర్మించబోతోంది. ఇదే సంస్థలో రెండు వెబ్‌‌ సిరీస్‌‌లకు పనిచేసిన మానస శర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతోంది.

ALSO READ | Shiva Rajkumar: జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లిని దర్శించుకున్న శివ రాజ్‌కుమార్‌.. అభిమానులతో సెల్ఫీలు

జీ5లో స్ట్రీమింగ్ అవుతున్న ‘ఒక చిన్న ఫ్యామిలీ’ సిరీస్‌‌కు క్రియేటర్‌‌‌‌గా వర్క్ చేసిన మానస, సోనీ లివ్‌‌లో స్ట్రీమింగ్‌‌ అవుతున్న ‘బెంచ్‌‌ లైఫ్‌‌’ సిరీస్‌‌కు దర్శకత్వం వహించింది. ఇప్పుడు ఫీచర్ ఫిల్మ్ డైరెక్టర్‌‌‌‌గా ఇదే బ్యానర్‌‌‌‌లో పరిచయం కాబోతోంది. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటించనున్నారు.