Madraskaaran OTT Update: ఓటిటిలోకి వచ్చేసున్న నిహారిక రొమాంటిక్ సాంగ్ సినిమా.. ఎక్కడ చూడాలంటే..?

Madraskaaran OTT Update: ఓటిటిలోకి వచ్చేసున్న నిహారిక రొమాంటిక్ సాంగ్ సినిమా.. ఎక్కడ చూడాలంటే..?

టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్, ప్రొడ్యూసర్ నిహారిక కొణిదెల హీరోయిన్ గా నటించిన తమిళ్ సినిమా మద్రాస్కారన్. యాక్షన్ ఎంటర్టైనర్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాని తమిళ్ ప్రముఖ డైరెక్టర్ వాలి మోహన్ దాస్ తెరకెక్కించగా ప్రొడ్యూసర్ బి. జగదీశ్ నిర్మించాడు. తమిళ్ యంగ్ హీరో షేన్ నిగమ్ హీరోగా నటించగా కలైయరసన్, ఐశ్వర్య దత్తా, పాండియరాజన్, కరుణాస్, సూపర్ సుబ్బరాయన్, గీతా కైలాసం, ఉదయరాజ్, దీపా శంకర్ తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు. 

ఈ చిత్రానికి సామ్ సిఎస్ సంగీతం అందించాడు. మద్రాస్కారన్ ఈ ఏడాది జనవరి 10న థియేటర్స్ లో రిలీజ్ అయింది. కానీ ఆశించిన స్థాయిలో ఆడియన్స్ ని అలరించలేకపోయింది. అలాగే రిలీజ్ అయిన రెండు రోజులలో కేవలం రూ.65 లక్షలు కలెక్ట్ చేసినట్లు సమాచారం. దీంతో జీరో షేర్ తో దర్శక నిర్మాతలకి నష్టాలు తెచ్చిపెట్టింది. 

ఈ సినిమా ఓటిటి రిలీజ్ డేట్ ని మేకర్స్ అనౌన్స్ చేశారు. ఇందులో భాగంగా ఫిబ్రవరి 7న మద్రాస్కారన్ సినిమా ఆహా (తమిళ్) ప్రసారమవుతుందని ప్రకటించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేయడంతోపాటు ఓటిటి రిలీజ్ ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. 

Also Raed :  వాలైంటెన్స్ డే రోజున ఓటిటిలోకి రానున్న పవర్ఫుల్ యాక్షన్ సినిమా

అయితే ఈ సినిమా రిలీజ్ కి ముందు కాదల్ సడుగుడు - వీడియో సాంగ్ తో మంచి హైప్ క్రియేట్ చేశారు. అయితే అప్పటివరకు గ్లామర్ ఎక్స్పోజింగ్ కి దూరంగా ఉన్న నిహారిక ఏ ఈపాటలో కొంతమేర బోల్డ్ గా కనిపించింది. దీంతో ఈ తమిళ్, తెలుగు ఆడియన్స్ ఈ సాంగ్ కి బాగా కనెక్ట్ అయ్యారు. కానీ స్టోరీ పేలవంగా ఉండటం, మేకింగ్ సరిగ్గా లేకపోవడం, కొన్ని సన్నివేశాలు ల్యాగ్ ఉండటంతో సినిమా ఫ్లాప్ అయ్యింది. దీంతో సినిమాలోని పాటలు బాగున్నా స్టోరీలో పస లేకపోతే హిట్ అవ్వడం కష్టమేనని మద్రాస్కారన్ నిరూపించింది.