
‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంతో నిర్మాతగా గొప్ప విజయాన్ని అందుకున్న నిహారిక.. ఇప్పుడు తన సొంత నిర్మాణ సంస్థ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై రెండో చిత్రాన్ని అనౌన్స్ చేసింది. మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ చిత్రాలతో మెప్పించిన సంగీత్ శోభన్ ఇందులో హీరోగా నటించబోతున్నాడు. సోలో హీరోగా తనకిదే మొదటి చిత్రం.
మానస శర్మ దీనికి దర్శకత్వం వహిస్తోంది. గతంలో సోనీ లివ్ రూపొందించిన ‘బెంచ్ లైఫ్’ సిరీస్‌ను ఆమె డైరెక్ట్ చేసింది. అలాగే నిహారిక బ్యానర్‌లో వచ్చిన ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ వెబ్ సిరీస్‌కు రచయితగానూ పనిచేసింది. అందులో సంగీత్ లీడ్ రోల్‌లో నటించాడు. ఇప్పుడు ఈ ముగ్గురి కాంబినేషన్ రిపీట్ అవుతోంది.