RDX హీరోతో నిహారిక రీ ఎంట్రీ.. హీరోయిన్గా కొత్త సినిమా షురూ!

RDX హీరోతో నిహారిక రీ ఎంట్రీ.. హీరోయిన్గా కొత్త సినిమా షురూ!

మెగా డాటర్ నిహారిక(Niharika) ప్రస్తుతం తన కెరీర్ పై ఫుల్ ఫోకస్ పెట్టారు. వరుసగా సినిమాలు ఒకే చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇటీవలే తన సొంత నిర్మాణ సంస్థలో కొత్త సినిమాను ప్రారంభించిన నిహారిక.. మళ్ళీ హీరోయిన్ గా చేయడానికి సిద్ధమవుతున్నారు. అప్పుడెప్పుడో కెరీర్ స్టార్టింగ్ లో ఒక మనసు అనే సినిమాలో హీరోయిన్ గా నటించిన నిహారిక.. ఇప్పటివరకు మళ్ళీ హీరోయిన్ గా నటించలేదు. ఇప్పుడు తాజాగా హీరోయిన్ గా రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యారు నిహారిక. అయితే అది తెలుగు సినిమా కోసం కాదు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shane Nigam (@shanenigam786)

అవును.. నిహారిక హీరోయిన్ గా రీ ఎంట్రీ ఇస్తోంది మలయాళ ఇండస్ట్రీలో. మలయాళంలో ఇటీవలే విడుదలై భారీ విజయాన్ని అందుకున్న RDX సినిమాలో హీరోగా చేసిన షేన్ నిగమ్ మద్రాస్ కారాన్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా నిహారికను ఫిక్స్ చేసినట్టు అధికారిక ప్రకటన ఇచ్చారు మేకర్స్. వాలి మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను.. ఎస్ ఆర్ ప్రొడక్షన్ బ్యానర్ పైబి జగదీష్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ మొదలైన ఈ సినిమా అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక నిహారిక రీ ఎంట్రీ గురించి తెలుసుకున్న మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ సినిమా మంచి విజయం సాధించి.. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ సినిమా నిహారికకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందా చూడాలి.