మెగా డాటర్ నిహారిక(Niharika) కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆమె గురించి ఎదో ఒక టాపిక్ నడుస్తోంది. ఇక రీసెంట్ గా భర్త చైతన్య జొన్నలగడ్డ(Chaitanya jonnalagadda) తో విడాకులు తీసుకొని వార్తల్లోకెక్కిన ఈ బ్యూటీ.. ఆతరువాత కూడా ఎదో ఒక రకంగా వైరల్ అవుతూనే ఉంది. ఇక తాజాగా మరోసారి నెటిజన్స్ దృష్టిని ఆకర్షించింది నిహారిక. తాజాగా ఆమె పెట్టిన ఇన్స్టా పోస్ట్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.
ALSO READ:అవకాశాల కోసం లొంగిపోయా.. అయినా కూడా!
అదేంటంటే.. రక్షాబంధన్ సందర్భంగా ఆమె తన అన్నలకు రాఖీ కడుతున్నప్పుడు తీసిన ఫొటోలను, వీడియోలను తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది. అందులో తన అన్నయ్యలు రామ్ చరణ్, వరుణ్ తేజ్లతో పాటు మరో అన్నయ్యకు కూడా రాఖీ కట్టింది నిహారిక. ఆ వీడియోకి ఈ రాఖీ పండుగ నాకు చాలా స్పెషల్.. ఒక అన్నయ్య త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు, ఇంకో అన్నయ్య ఈ మధ్యే తండ్రయ్యాడు, మరో అన్న ఐదేళ్ల తర్వాత ఈ మధ్యే ఇండియాకి వచ్చాడు. ఆల్ లవ్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం నిహారిక షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో తగ వైరల్ అవుతోంది.