![ఉపాధి కోసం చెన్నైకి వెళ్లిన హీరో.. హీరోయిన్ తో రొమాన్స్.. చివరికి ఏం జరిగిందంటే.?](https://static.v6velugu.com/uploads/2025/02/niharikas-madraskaaran-movie-streaming-in-aha-ott_8hwiWcACrj.jpg)
- టైటిల్: మద్రాస్కారన్,
- ప్లాట్ ఫాం: ఆహా (తమిళం)
- డైరెక్టర్: వాలి మోహన్ దాస్
- నటీనటులు: షేన్ నిగమ్, కలైయరసన్, నిహారిక కొణిదెల, ఐశ్వర్య దత్తా, కరుణాస్
టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్, ప్రొడ్యూసర్ నిహారిక కొణిదెల హీరోయిన్ గా నటించిన తమిళ్ యాక్షన్ ఎంటర్టైనర్ మద్రాస్కారన్ ప్రముఖ ఓటిటి ఆహాలోకి వచ్చేసింది. తమిళ్ యంగ్ హీరో షేన్ నిగమ్ హీరోగా నటించగా కలైయరసన్, ఐశ్వర్య దత్తా, పాండియరాజన్, కరుణాస్, సూపర్ సుబ్బరాయన్, గీతా కైలాసం, ఉదయరాజ్, దీపా శంకర్ తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు. ఈ సినిమాని తమిళ్ ప్రముఖ డైరెక్టర్ వాలి మోహన్ దాస్ తెరకెక్కించగా ప్రొడ్యూసర్ బి. జగదీశ్ నిర్మించాడు. సామ్ సిఎస్ సంగీతం అందించాడు.
కథ ఏమిటంటే..?
సత్య (షేన్ నిగమ్) కుటుంబం పుదుకోట్టై నుంచి ఉపాధి కోసం చెన్నైకి వలస పోతుంది. సత్య అక్కడే తన ఫ్రెండ్ మీరా (నిహారిక కొణిదెల)ని ప్రేమిస్తాడు. పెండ్లి మాత్రం సొంతూరిలో చాలా ఘనంగా చేసుకోవాలి అని నిర్ణయించుకుంటాడు. తన గ్రామస్తులకు ప్రస్తుతం తను అనుభవిస్తున్న సంపన్న జీవితం గురించి తెలియజేయాలి అనుకుంటాడు. అతను ఒకటి తలిస్తే.. విధి మరొకటి తలచినట్టు.. అనుకోకుండా లోకల్ రౌడీ దురై సింగం (కలైయరసన్)తో గొడవపడతాడు. సింగం భార్య కళ్యాణి (ఐశ్వర్య దత్తా) పెండ్లి జరిగిన చాలా సంవత్సరాలకు ప్రెగ్నెంట్ అవుతుంది. సత్య నిర్లక్ష్యంగా కారు నడపడం వల్ల ఆమెకు యాక్సిడెంట్ అవుతుంది. ఆ తర్వాత సింగం ఏం చేశాడు? సత్యం పెళ్లి జరిగిందా? లేదా? అనేది మిగతా కథ.
అయితే మద్రాస్కారన్ ఈ ఏడాది జనవరి 10న థియేటర్స్ లో రిలీజ్ అయింది. కానీ ఆశించిన స్థాయిలో ఆడియన్స్ ని అలరించలేకపోయింది. అలాగే రిలీజ్ అయిన రెండు రోజులలో కేవలం రూ.65 లక్షలు కలెక్ట్ చేసినట్లు సమాచారం. దీంతో జీరో షేర్ తో దర్శక నిర్మాతలకి నష్టాలు తెచ్చిపెట్టింది.