
నిజామాబాద్ లోక్ సభ పోలింగ్ పలు మలుపులు తిరుగుతోంది. ఎన్నికలను ఎలా నిర్వహిస్తారనే కన్ ఫ్యూజన్ మొదట్లో ఉండేది. తాజాగా ఈసీ ఓ నిర్ణయం తీసుకుంది. ఈవీఎంలతోనే పోలింగ్ నిర్వహించాలని డిసైడైంది. ఐతే… దీనిపై నిజామాబాద్ రైతులు అభ్యంతరం చెబుతున్నారు.
తమ సమస్యలను నాయకులు పట్టించుకోవడం లేదంటూ ఇప్పటికే నిజామాబాద్ రైతులు భారీగా నామినేషన్లు వేశారు. దాదాపు 185 మంది పోటీ పడుతున్న నిజామాబాద్ లోక్ సభ స్థానంలో ఎలక్షన్ కమిషన్.. ఈవీఎంల ద్వారానే పోలింగ్ నిర్వహించాలని నిర్ణయించింది. తాజాగా ఈసీ తీసుకున్న ఈ నిర్ణయంతో రైతులంతా జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్‌లో సమావేశమయ్యారు. ఈవీఎంలపై తమకు నమ్మకం లేదని.. ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ మాత్రమే ఉపయోగించాలని రైతులు ఈ సమావేశంలో తేల్చి చెప్పారు.