అపుడో ఇపుడో ఎపుడోలో రేసర్ రిషిగా నిఖిల్..

అపుడో ఇపుడో ఎపుడోలో రేసర్ రిషిగా నిఖిల్..

నిఖిల్ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’. కన్నడ హీరోయిన్ రుక్మిణీ వసంత్ ఈ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. దివ్యాంశ కౌశిక్ మరో హీరోయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.  బీవీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. దసరా కానుకగా శుక్రవారం ఈ మూవీ టీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు మేకర్స్.  ఇందులో లోకల్ రేసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  రిషిగా నిఖిల్ పాత్రను పరిచయం చేశారు. 

లండన్ వెళ్లి తెల్ల పిల్లను పడేసి ప్రపంచమంతా చుట్టేద్దామనుకుంటాడు హీరో . ఈ ప్రయత్నంలో తనకు ఎదురైన అనుభవాలను ఆసక్తికరంగా టీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చూపించారు.  ‘ప్రపంచంలో నైంటీ పర్సెంట్ అబ్బాయిలు తాగడానికి కారణం అమ్మాయిలే’ అని నిఖిల్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది.  స్వామిరారా,  కేశవ చిత్రాల తర్వాత నిఖిల్, సుధీర్ వర్మ కాంబినేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వస్తున్న మూడో సినిమా కావడంతో అంచనాలు ఏర్పడ్డాయి.  నవంబర్ 8న సినిమా  విడుదల కానుంది.