బిగ్ బాష్ లీగ్ లో భారత క్రికెటర్ నిఖిల్ చౌదరీ అదరగొట్టేస్తున్నాడు. హోబర్ట్ హరికేన్స్ తరపున ఆడుతున్న ఈ 27 ఏళ్ల కుర్రాడు నిన్న (జనవరి 7) జరిగిన మ్యాచ్ లో 38 బంతుల్లో 55 పరుగులు చేశాడు. స్వల్ప లక్ష్య ఛేదనలో అందరూ విఫలమైనా ఒక్కడే ఒంటరి వారియర్ లా పోరాడాడు. వర్షం కారణంగా 16 ఓవర్లలో 118 పరుగుల లక్ష్యాన్ని కుదించగా హోబర్ట్ 116 పరుగులకే పరిమితమై ఒక పరుగు తేడాతో ఓడి పోయింది. మ్యాచ్ సంగతి పక్కనపెడితే అసలు భారత క్రికెటర్ బిగ్ బాష్ లీగ్ ఎలా ఆడాడో ఇప్పుడు చూద్దాం.
భారత క్రికెటర్లు విదేశాల్లో జరిగే మెగా లీగ్ లు ఆడటానికి వీలు లేదని బీసీసీఐ ఇదివరకే స్పష్టం చేసింది. ఈ లిస్టులో బిగ్ బాష్ లీగ్ కూడా ఉంది. అయితే నిఖిల్ బిగ్ బాష్ లీగ్ లో రాణించడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. అసలు వివరాల్లోకెళ్తే.. నిఖిల్ న్యూఢిల్లీలో జన్మించాడు. దేశావళి క్రికెట్ లో పంజాబ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. భారత క్రికెట్ లో విపరీతమైన ఉన్న కారణంగా ఈ యువ క్రికెటర్ ఇక్కడ క్రికెట్ కు గుడ్ బై చెప్పేసి 2020 లో ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ వెళ్ళాడు.
బ్రిస్బేన్ క్లబ్ తరపున క్రికెట్ ఆడుతూ బిగ్ బాష్ లీగ్ లో అవకాశం దక్కించుకున్నాడు.డిసెంబర్ 20, 2023లో BBLలో అరంగేట్రం చేసిన నిఖిల్.. తొలి మ్యాచ్ లోనే డిఫెండింగ్ ఛాంపియన్స్ పెర్త్ స్కార్చర్స్‌పై 31 బంతుల్లో 40 పరుగులు చేశాడు. ప్రతి మ్యాచ్ లోనూ నిలకడగా రాణిస్తూ తన పవర్ హిట్టింగ్ చూపిస్తున్నాడు. ఉన్ముక్త్ చంద్ తర్వాత భారత్ నుంచి బిగ్ బాష్ లీగ్ లో ఆడిన రెండో క్రికెటర్ నిఖిల్ చౌదరీ.
Nikhil Chaudhary that is INSANE! ? #BBL13 pic.twitter.com/CC9ENToWv5
— KFC Big Bash League (@BBL) January 7, 2024