యంగ్ టాలెంటెడ్ నిఖిల్ సిద్ధార్థ (Nikhil Siddhartha) హీరోగా సుధీర్ వర్మ (Sudheer Varma) దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’(AIE). రుక్మిణీ వసంత్, దివ్యాంశ కౌశిక్ హీరోయిన్స్. బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించారు.
ఓటీటీ:
యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ 2024 నవంబర్ 8న థియేటర్లలో రిలీజై నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. అసలు నిఖిల్ ఈ కథను ఎలా ఒప్పుకున్నాడు? డైరెక్టర్ సుధీర్ వర్మ ఈ సినిమాను ఎలా తెరకెక్కించాడు? అంటూ నెటిజన్స్ నుంచి విమర్శలు వచ్చాయి. దాంతో ఈ మూవీకి మోస్తరు ఓపెనింగ్స్ రాగా.. లాంగ్ రన్ లో సైలెంట్ అయిపొయింది. ఇక ఈ మూవీ నెల తిరగకుండానే ఓటీటీకి వచ్చేసింది.
ఈ మూవీ బుధవారం (నవంబర్ 27న) అర్ధరాత్రి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కి వచ్చింది. ఏ సినిమా అయిన థియేటర్ కి వచ్చిన నాలుగు నుంచి 6 వారాల తర్వాత ఓటీటీకి వస్తోంది. కానీ, ఈ సినిమా మూడు వారాల్లోనే వచ్చేసింది. ఇక థియేటర్స్ లో చూడని వారు ఓటీటీలో చూసి ఎంజాయ్ చేసేయండి.
high OCTANE thrill meets breezy ROMANCE - Rishi & Tara's story is an eclectic mix of all 🔥🫰#AppudoIppudoEppudoOnPrime, watch now: https://t.co/E13aHqpQOn pic.twitter.com/apBDEZ56Gw
— prime video IN (@PrimeVideoIN) November 26, 2024
కథేంటంటే:
రిషి (నిఖిల్) ఇండియాలో తార (రుక్మిణి వసంత్) అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. అలా తన ప్రేమ విషయం చెప్పడానికి చాలా ప్రయత్నాలు చేస్తాడు. ఇంతలోనే తన ఫ్రెండ్ బయాజ్(వైవా హర్ష) చేసిన ఓ మిస్టేక్ వల్ల రిషి లవ్ ఫెయిల్ అవుతుంది. ఆ తర్వాత రిషి లండన్ వెళ్లిపోతాడు. అక్కడ తులసి(దివ్యాంశ కౌశిక్)తో పరిచయం ఏర్పడి,అది కాస్త ప్రేమగా మారుతుంది. ఇంతలోనే తులసి కనిపించకుండా పోతుంది. అలాగే లోకల్ డాన్ బద్రీనారాయణ (జాన్ విజయ్) రిషిని అటాక్ చేస్తాడు. దాంతో తులసిని ఎవరు కిడ్నాప్ చేశారు? తార లండన్ ఎందుకు రావాల్సి వచ్చింది. బద్రీనారాయణ్ రిషి జీవితంలోకి ఎందుకు వచ్చాడు? రిషి ప్రేమ ఏమైంది? చివరకి ఎవర్ని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు? అనేది స్టోరీ.