యంగ్ హీరో నిఖిల్ తన తరువాతి సినిమా కోసం ఇండియాస్ మోస్ట్ సీక్రెట్ స్టోరీని ఎంచుకున్నాడు. స్పై అనే టైటిల్ తో తెరకక్కుతున్న ఈ సినిమా లోగోని రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఈ వీడియో చూస్తుంటే స్పై మూవీ రొటీన్ యాక్షన్ థ్రిల్లర్ కాదని.. ఓ నేషనల్ థ్రిల్లర్ అని అర్థం అవుతోంది. భారతదేశం యొక్క రహస్య కథను ఈ సినిమాలో చెప్పబోతున్నారని తెలుస్తోంది. అంతేకాదు.. ఈ వీడియోలో సుభాష్ చంద్రబోస్ లోగో మరియు అతని "తుమ్ ముజే ఖూన్ దో మైన్ తుమ్హే ఆజాదీ దూంగా" అనే నినాదాన్ని కూడా యాడ్ చేశారు. తుమ్ ముజే ఖూన్ దో మైన్ తుమ్హే ఆజాదీ దూంగా అంటే మీరు నాకు రక్తం ఇవ్వండి నేను మీకు స్వేచ్ఛ ఇస్తాను అని అర్థం.
ఇప్పటివరకు వచ్చిన రొటీన్ కాన్సెప్ట్ కాకుండా యూనిక్ పాయింట్తో ఈ సినిమా రూపొందుతోంది. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న సినిమాతో ప్రముఖ ఎడిటర్ గ్యారీ బీహెచ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాని ఎడ్ ఎంటర్ టైన్ మెంట్స్ పై కె రాజశేఖర్ రెడ్డి భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఈ వీడియోతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇక ఈ సినిమా టీజర్ మే 12న ప్రేక్షకుల ముందుకి తీసుకురానున్నారు. జూన్ 29వ తేదీన సినిమాని విడుదల చేయబోతున్నట్లు ప్రాకటించారు. ఈ సినిమాలో నిఖిల్ సరసన, ఈశ్వర్యా మీనన్ కథానాయికగా నటిస్తోంది. మరి.. నిఖిల్ గత చిత్రం కార్తికేయ2 లాగే ఈ సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటుతుందా అనేది చూడాలి మరి.