ఎప్పుడూ విభిన్న కథనాలు ఎంచుకుంటూ సరికొత్త ప్రయోగాలు చేస్తుంటాడు తెలుగు ప్రముఖ హీరో నిఖిల్. ఈసారి "అప్పుడో ఇప్పుడో ఎప్పుడో" అంటూ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. యాక్షన్ ఎంటర్‌టైనర్ బ్యాక్ డ్రాప్ లో టాలెంటెడ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వం తెరకెక్కిస్తున్నాడు. ఇక నిఖిల్ కి జంటగా కన్నడ యంగ్ హీరోయిన్ రుక్మిణి వసంత్ నటించింది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.
ఇటీవలే "అప్పుడో ఇప్పుడో ఎప్పుడో చిత్ర పోస్టర్ ని సోషల్ మీడియాలో చిత్ర యూనిట్ షేర్ చేశారు. ఈ పోస్టర్ లో హీరో నిఖిల్ మరియు రుక్మిణి వసంత్ నడుస్తూ క్లాస్ లుక్ లో కనిపించారు. అలాగే దీపావళి పండుగకి మరిన్ని వివరాలు తెలియజేస్తామని చిత్ర యూనిట్ ఈ పోస్టర్ ద్వారా ఆడియన్స్ కి తెలిపారు. దీంతో నిఖిల్ కొత్త సినిమాపై ఆసక్తి నెలకొంది.
Also Read :- నాలుగు రోజుల్లో షూటింగ్ ప్యాకప్
అయితే గతంలో నిఖిల్ మరియు సుధీర్ వర్మ కాంబినేషన్లో వచ్చిన స్వామి రా రా మరియు కేశవ చిత్రాలు ప్రేక్షకులను బాగానే అలరించాయి. దీంతో సుధీర్ వర్మ మరియు నిఖిల్ అప్పుడో ఇప్పుడో ఎప్పుడో చిత్రంతో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ కొట్టడానికి సిద్ధమవుతున్నారు.