30 ఏళ్ల తర్వాత అవమానాలు గుర్తొచ్చాయి.. : డిస్ట్రిబ్యూటర్లపై మాజీ నటి సంచలన వ్యాఖ్యలు

30 ఏళ్ల తర్వాత అవమానాలు గుర్తొచ్చాయి.. : డిస్ట్రిబ్యూటర్లపై మాజీ నటి సంచలన వ్యాఖ్యలు

బాలీవుడ్ వెటరన్ హీరోయిన్ నికి అనెజా వాహ్లియా తన మొదటి సినిమా సమయంలో జరిగిన విషయాల్ని గుర్తు చేసుకున్నారు. ఇందులోభాగంగా తనకి నటి అవ్వాలనే కోరిక లేకపోయినప్పటికీ తన తండ్రి, కుటుంబ కోసం ఇండస్ట్రీకి వచ్చానని తెలిపింది. తనకి చిన్నప్పుడు పైలెట్ కావాలని ఉండేదని కానీ తన తండ్రి చదువుకోవడానికి డబ్బులు ఇచ్చేవాడు కాదని దాంతో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసానని చెప్పుకొచ్చింది

తాను 1994లో ప్రముఖ స్టార్ హీరో అనీల్ కపూర్ హీరోగా నటించిన మిస్టర్ ఆజాద్ అనే చిత్రం ద్వారా సినీ కెరీర్ ని ఆరంభించానని ఈ సినిమా షూటింగ్ సమయంలో కొంతమేర అసౌకర్యంగా అనిపించిందని తెలిపింది. అయితే సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత డిస్ట్రిబ్యూటర్లతో కలసి డిన్నర్ కి వెళ్లాలని నిర్మాతలు ఒత్తిడి చేశారని సంచలన వ్యాఖ్యలు చేసింది. 

దీంతో ఎందుకు డిన్నర్ కి వెళ్లాలని నిర్మాతలని అడగ్గా "సినిమా ని సేల్ చేసే సమయంలో కాంప్రమైజ్ అయ్యి ఇలా హీరోయిన్లు విందులు, వినోదాల్లో పాల్గొనాలని ఇదంతా ప్రమోషన్స్ లో భాగమేనని చెప్పారట". దీంతో అనీల్ కపూర్ ఆల్రెడీ ప్రమోషన్స్ లో ఇన్వాల్వ్ అవుతున్నారని చెప్పినప్పటికీ దర్శక నిర్మాతలు ఒప్పుకోలేదని దీంతో ఆ సమయంలో ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోవాలని డిసైడ్ అయ్యానని కానీ కుదరలేదని చెప్పుకొచ్చింది. 

అయితే అప్పటికే షారుఖ్ ఖాన్ సినిమాని కమిట్ అయ్యి ఉండటం, తన తండ్రి మరణంతో కుటుంబం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తో ఇబ్బంది పడుతుండటం వంటి కారణాలతో ఇండస్ట్రీలోనే కొనసాగాల్సి వచ్చిందని ఎమోషనల్ అయ్యింది. కానీ షారుఖ్ ఖాన్ సినిమా షూటింగ్ సమయంలో తోటి నటీనటులతో మంచి ఎక్స్ పీరియన్స్ కలిగిందని దీంతో ఇండస్ట్రీపై మంచి అభిప్రాయంతో కొన్నేళ్లపాటూ నటిగా కొనసాగానని చెప్పుకొచ్చింది. ఏదేమైనప్పటికీ ఇండస్ట్రీలో మంచితోపాటూ చెడు కూడా ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని అభిప్రాయం వ్యక్తం చేసింది. 

ఈ విషయం ఇలా ఉండగా నటి నికి అనెజా వాహ్లియా యూకే కి చెందిన వాలియా సంస్థల అధినేత సోనీ వాలియా ని 2002లో ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వత సినిమాలకి బ్రేక్ ఇచ్చి అక్కడే సెటిల్ అయ్యింది. 11 ఏళ్ళ తర్వాత షాహీద్ కపూర్, అలియా భట్ 2015లో  నటించిన శాందార్ అనే సినిమా ద్వారా మళ్ళీ కెరీర్ స్టార్ట్ చేసింది. కానీ ఆశించిన స్థాయిలో రాణించలేకేపోతోంది.