'స్పై’ అనే యాక్షన్ థ్రిల్లర్‌తో త్వరలో ప్రేక్షకుల ముందుకొస్తున్న నిఖిల్.. ఆ సినిమా రిలీజ్‌కు ముందే వరుస సినిమాలకు కమిట్ అయ్యాడు. నిఖిల్ పుట్టిన రోజు సందర్భంగా గురువారం మరో కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశారు. భరత్ కృష్ణమాచారి డైరెక్ట్ చేస్తున్నాడు. ఠాగూర్ మధు సమర్పణలో భువన్, శ్రీకార్ నిర్మిస్తున్నారు. దీనికి ‘స్వయంభు’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ‘భారత సామ్రాజ్యం సైన్యం ద్వారా కాదు.. ఒక వ్యక్తి పరాక్రమం, ధైర్యంతో నిర్మించబడింది’ అంటూ ఫస్ట్ లుక్‌ని రివీల్ చేశారు.
చేతిలో బల్లెం, పొడవాటి జుట్టుతో నిఖిల్ ఓ యుద్ధ వీరుడిలా ఫెరోషియస్‌గా కనిపిస్తున్న ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలను పెంచింది. ఆగస్టు నుంచి ఈ మూవీ షూటింగ్ మొదలవబోతుంది. నిఖిల్ కెరీర్లోనే ఇది హయ్యెస్ట్ బడ్జెట్ మూవి. రవి బస్రూర్ సంగీతమందిస్తుండగా మనోజ్ పరమహంస సినిమాటోగ్రాఫర్. వాసుదేవ్ మునెప్పగరి డైలాగ్స్ రాస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో తెరకెక్కబోతోంది.