భీకరమైన వరదల నేపథ్యంలో.. ముంబై డైరీస్ సీజన్ 2 ట్రైలర్

అమెజాన్ ప్రైమ్(Amazon Prime) లో ముంబై డైరీస్ 26/11 వెబ్ సిరీస్ 2021లో ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. ముంబై లో జరిగిన టెర్రర్ ఎటాక్స్ నేపథ్యంలో ముంబై డైరీస్ సీజన్ 1 తెరకెక్కించారు డైరెక్టర్ నిఖిల్ అద్వానీ (Nikkhil Advani ). దీంతో ఈ సీరిస్ అద్భుత విజయాన్ని అందుకుంది.ఇప్పుడు మళ్ళీ రెండేళ్ల తర్వాత ముంబై డైరీస్ సీజన్ 2 స్టార్ట్ చేశారు. లేటెస్ట్గా ముంబై డైరీస్ సీజన్ 2(Mumbai Diaries Season 2), ట్రైలర్ రిలీజ్ అయింది. ముంబైలో కురిసిన భీకరమైన వరదల నేపథ్యంలో సీజన్ 2 ను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. 

ట్రైలర్ విషయానికి వస్తే.. 

ముంబైలో 2005, జులై 26న కురిసిన వరదలకు సుమారు 1100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వీరు ప్రాణాలు విడిచేటపుడు..జరిగిన సంఘటనలను ట్రైలర్లో ఎంతో హార్ట్ టచింగ్గా చూపించారు. ఈ వరదల్లో ముంబై నగరం అంతా మునిగిపోతుండగా..డాక్టర్లు, సిబ్బంది..రోగులకు వైద్యం చేసేందుకు ఎలా శ్రమించారో ట్రైలర్ చూస్తే అర్ధం అవుతుంది. 

ఒక పక్క పూర్తిగా కరెంట్ పోవడం, వర్షం నీళ్లు డైరెక్ట్ హాస్పిటల్స్ లోకి రావడం వంటి సీన్స్ తో ట్రైలర్ ఆకట్టుకుంది. ఈ వరదల వల్ల సామాన్య ప్రజల జీవితం అస్తవ్యస్తంగా మారిపోవడం..రోడ్డుపై వెహికిల్స్ ఎక్కడికక్కడ ట్రాఫిక్ లో చిక్కుకొని ఉండటం..ప్రజలు వరదలో కొట్టుకుపోవడం సీన్స్ ఇంటెన్స్ వైబ్ ని కలిగిస్తున్నాయి. అంతేకాకుండా..హఠాత్తుగా మ్యాన్ హోల్స్ లో పడి జనాలు గల్లంతు అయ్యే సీన్స్ ఎమోషన్ అయ్యేలా చేస్తున్నాయి. 

ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో తినడానికి తిండి కూడా దొరకకుండా చనిపోయిన మనుషులను చూపిస్తూ కంటతడి పెట్టేలా చేశాడు డైరెక్టర్. ఈ ప్రకృతి విపత్తుని ఎదుర్కోవడానికి ప్రభుత్వం, అధికారులు, ప్రజలు, డాక్టర్స్ ఎలా తమ ప్రాణాలని తెగించి పోరాడారో ట్రైలర్లో చక్కగా చూపించారు.  

ఈ సీరిస్లో మోహిత్ రానా, కొంకణా సేన్ శర్మ, సత్యజిత్ దూబే, శ్రేయా ధన్వంతరి తదితరులు నటించారు. రీసెంట్గా మలయాళీ సూపర్ హిట్ మూవీ 2018కి ముంబై డైరీస్ సీజన్ 2 దగ్గర పోలీకలు ఉన్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే 2018 మూవీ కూడా కేరళలో సంభవించిన తుఫాన్, వరదల నేపథ్యంలోనే తెరకెక్కించగా రిలీజైన అన్ని భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. 

ఇకపోతే ముంబై డైరీస్ సీజన్ 1 టెర్రర్ ఎటాక్స్ నేపథ్యంలో వచ్చి అందరినీ కదిలించింది. ఇప్పుడు  ముంబై డైరీస్ సీజన్ 2 ముంబై ఫ్లడ్స్ నేపథ్యంలో వస్తుంది. ఈ సిరీస్ కూడా ఆడియన్స్ని మెప్పెంచేలా ఉంది. వచ్చే నెల (అక్టోబర్ 26న) ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ కానుంది. ముంబై డైరీస్ సీజన్ 2 నిఖిల్ అద్వానీ  డైరెక్ట్ చేస్తుండగా..మోనిషా అద్వానీ & మధు భోజ్వానీ నిర్మిస్తున్నారు.