25 ఎంపీ పిక్సెల్​సెన్సర్​తో నికాన్​జెడ్​6 3

కెమెరాల తయారీదారు నికాన్​ హైదరాబాద్​లో తన లేటెస్ట్​ ప్రొడక్ట్​ ​జెడ్​6 ‘3’ను లాంచ్​ చేసింది. ఈ మిర్రర్​లెస్​కెమెరాలో 25.4 ఎంపీ మెగాపిక్సెల్​ సెన్సర్, 5.7 మిలియన్​ డాట్​ రిజల్యూషన్​, ఎన్​-లాగ్​, ఎన్​-రా, ప్రోరెస్​రా హైక్యూ, 4కే, 6కే వీడియో రికార్డింగ్​ వంటి ఫీచర్లు ఉన్నాయి.

నికాన్ జెడ్​6 ‘3’ కెమెరా బాడీ ధర రూ.2.48 లక్షలు. లెన్సులకు అదనంగా చెల్లించాలి. దీని కొనుగోలుపై రూ.27 వేల విలువైన ఆఫర్లు ఇస్తున్నారు.