
ఖిల్లాగణపురం, వెలుగు : ఖిల్లాగణపురంలోని టీజీ మోడల్ స్కూల్ స్టూడెంట్ నీలావతి ఎస్జీ ఎఫ్ హాకీ టోర్నమెంట్లో రాష్ట్రస్థాయిలో ప్రతిభను చాటి జాతీయ స్థాయికి సెలక్ట్ అయింది. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న నీలావతి ఈ నెల 27 న ఝార్ఖండ్ రాష్ట్రం రాంచీలో జరుగనున్న హాకీ టోర్నమెంట్లో పాల్గొననుంది. ప్రిన్సిపాల్ ఉమాదేవి, పీడీ చందర్ లు స్టూడెంట్ను అభినందించారు. జాతీయ స్థాయిలోనూ రాణించాలని ఆకాంక్షించారు.