
సౌమిత్ రావు హీరోగా నటిస్తూ సాయి వెన్నంతో కలిసి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘నిలవే’. శ్రేయాసి సేన్ హీరోయిన్. గిరిధర్ రావు పోలాటి, సాయి వెన్నం నిర్మిస్తున్నారు. సోమవారం ఈ మూవీ టీజర్‌ను విడుదల చేశారు. ఒంటరి ప్రయాణంతో విసిగి వేసారిన అర్జున్ (సౌమిత్ రావు) జీవితంలోకి తొలకరి జల్లులా ఓ అమ్మాయి (శ్రేయాసి సేన్) వస్తుంది. వచ్చీ రావడంతోనే అతని జీవితంలోకి కొత్త వెలుగులు తీసుకొస్తుంది.
ఆమె ప్రేమ కోసం అతను ఎంతదూరం వెళ్లాడు.. ఏం చేశాడు అనేది మ్యూజికల్ డ్రామాగా తెరకెక్కించినట్టు టీజర్‌ను బట్టి అర్థమవుతోంది. ప్లెజెంట్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీతో మనసుకు హత్తుకునేలా సాగింది టీజర్. హర్ష చెముడు, సుప్రియా ఐసోలా, రూపేష్ మారాపు, జీవన్ కుమార్, గురురాజ్, సిద్ధార్థ్ గొల్లపూడి, అనాల సుశ్మిత ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. కళ్లాన్ నాయక్ సంగీతం అందిస్తున్నాడు.