
మెహిదీపట్నం, వెలుగు: నలుగురు పసికందుల ఊపిరితిత్తుల్లోకి పేగులు రావడంతో నిలోఫర్ డాక్టర్లు ఆపరేషన్ తో వాటిని సరిచేశారు. సంబంధిత వివరాలను హాస్పిటల్సూపరింటెండెంట్రవికుమార్వెల్లడించారు. నలుగురు గర్భిణులు జనగామ నుంచి వి.అనూష, కరీంనగర్నుంచి ఎండీ.సల్మా, నల్గొండ నుంచి వై.నవనీత, మణికొండ నుంచి ఎం.దివ్య తమకు దగ్గరలోని ప్రైవేటు హాస్పిటల్స్లో ట్రీట్మెంట్తీసుకున్నారు.
డెలివరీ సమయానికి బేబీల ఊపిరితిత్తుల్లోకి పేగులు వచ్చినట్లు వైద్యులు గుర్తించారు. నలుగురినీ నిలోఫర్హాస్పిటల్కు రిఫర్చేయడంతో నెల రోజుల క్రితం జాయిన్అయ్యారు. వైద్యులు ప్రసవం చేసి, పసికందులను అబ్జర్వేషన్లో ఉంచారు. ఆపరేషన్ద్వారా పేగులను సరిచేశారు. 20 రోజుల తర్వాత తల్లులు, బిడ్డల ఆరోగ్యం బాగుండటంతో మంగళవారం డిశ్చార్జ్చేశారు.
ఈ సందర్భంగా సూపరింటెండెంట్మాట్లాడుతూ..పేగులు ఊపిరితిత్తుల్లోకి రావడాన్ని కంజెంటల్ డై ఫ్రాగ్మెంట్ హెర్నియా అంటారని చెప్పారు. పుట్టిన పిల్లలకు ఇది రావడం చాలా అరుదని తెలిపారు. ఈ ఆపరేషన్ఎంతో క్లిష్టమైందని పేర్కొన్నారు. పీడియాట్రిక్ సర్జన్నారాయణ, నియోనటాలజీ హెచ్ వోడీ స్వప్న టీం, ఆర్ఎంవో నాగజ్యోతి ఉన్నారు.