బెంగళూరులో 3BHK.. రూమ్మేట్ కావాలంట.. 3 amకి ఆకలేసినా వండి పెడుతుందంట.. ఎంత మంచి అమ్మాయో..!

బెంగళూరులో 3BHK.. రూమ్మేట్ కావాలంట.. 3 amకి ఆకలేసినా వండి పెడుతుందంట.. ఎంత మంచి అమ్మాయో..!

బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో 3BHK ఫ్లాట్లో రెంట్కు ఉంటున్న ఓ యువతి తన ‘ఎక్స్’ ఖాతాలో పెట్టిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్గా మారింది. బెంగళూరు లాంటి నగరంలో సక్రమంగా ఉండే ఫ్లాట్మేట్ దొరకడం ఎంత కష్టమైన విషయమో తెలిసొచ్చేలా చేసింది. ఫిమేల్ ఫ్లాట్మేట్ కావాలని ‘ఎక్స్’లో ఆమె పెట్టిన పోస్ట్కు 3 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.

బెంగళూరులో నిమిషా చంద అనే 23 ఏళ్ల యువతి మార్కెటింగ్ ప్రొఫెషనల్. బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లే-ఔట్లో 3BHK ఫ్లాట్లో మరో యువతితో కలిసి ఉంటోంది. ఇంకొక ఫిమేల్ ఫ్లాట్ మేట్ దొరక్కపోతుందా అనే ఉద్దేశంతో ఈ ఇద్దరూ అద్దె ఎక్కువైనా 3BHK ఫ్లాట్ రెంట్కు తీసుకున్నారు. దాదాపు నెల రోజుల నుంచి ఫిమేల్ ఫ్లాట్ మేట్ కోసం వీళ్లు చేయని ప్రయత్నం లేదు. కానీ.. ఒక్కరు దొరకలేదు. దీంతో.. ఇక లాభం లేదనుకుని కొంచెం కొత్తగా ఆలోచించారు.

ఫిమేల్ ఫ్లాట్ మేట్ కావాలని ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. అయితే.. తమకు కొన్ని కండీషన్లు ఉన్నాయని చెప్పారు. ఆ షరతులేంటో పోస్ట్ లో స్పష్టంగా, ఒక్కొక్కటిగా వివరించారు. ముందు ఆ ఇద్దరి గురించి చెప్పుకొచ్చారు. ఇంటిని క్లీన్ గా ఉంచుకుంటామని.. అలా అని మిలటరీ క్లీన్లీనెస్ ఏం కాదని.. బేసిక్ హైజీన్ను పాటిస్తామని చెప్పారు. ఈ యువతులు ఉంటున్న ఫ్లాట్లో ఫ్లాట్ మేట్గా జాయిన్ అయి వారితో పాటు ఉండాలంటే షరతులేంటో.. ఒక్కసారి ఆమె పెట్టిన పోస్టులో చదివి తెలుసుకోండి మరి.